పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లవురియా అరారాజ్, లవురియా నందంగఢ స్తంభములూ

ఈ స్తంభములు లవురియాయను పేరుగల రెండు ప్రత్యేక గ్రా మ ములవద్దనున్నవి. మొదటిది అరరాజ్ అనుశివాలయమునకు దగ్గరగా సుండుట చేత లవురియా ఆరారాజ్ అనియు, రెండవది నంవంగఢమునకు దగ్గరగా నుండుట చేత లవురీయానందంగఢమనియు నీ స్తంభములకు పేళ్ళు పెట్టఁబడినవి. ఇవి లింగాకారముగనుండుటచేత వీనిని జనులు లింగము లుగా పూజించుచున్నారు. ఈ స్తంభమఃలున్న గ్రామములు రెండును ఉత్తర బీహారులోని చాంపారను జిల్లాలోనున్నవి. లవురియా అరారాజ్ స్తంభము ముప్పదియాఱున్నర అడుగుల యెత్తుగనున్నది. పూర్వము ఈ స్తంభముచివర గరుడవిగ్రహముండెవట. లవురియనందంగఢస్తం భము 32 అడుగుల 9 అంగుళములఎత్తుగా నున్నది. దీని పై భాగమున ఘంటాకారముగ నున్న 6 అడుగుల 10 అంగుళముల ఎత్తుగల భాగము న్నది. దాని పైని ఉత్తరముఖముగనున్న యొక సింహవిగ్రహమున్నది. దీనిచుట్టును హంస లు మేత మేయు,చున్నట్లు వరుసగా చెక్కబడియున్నవి. దీని పైని ఔరంగజేబు చక్రవర్తి యొక్క ఒక శాసనముకూడ కలదు.

లెరియ-అర రాజస్తంభము.

మొదటి స్తంభ శాససము: లౌరియు-అర రాజు.

(1) స్తంభము తూర్పుముఖము.

1.(1) దేవా సంపియే పియదసి లాజ హేవం ఆహ (2) సడునీ సతివసాభి
సితేన మే ఇయం ధంమలిపి
2.లిఖాపిత (3) హిదత పాలతే దుసంపటి పాదయే అంవత అగాయ
ధంమకామ తాయ అగాయ పలీఖాయ

18