Jump to content

పుట:AntuVyadhulu.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

Vi

ఈగ్రంథమునందు అంటువ్యాధుల వ్యాపకమును, నివారించు మార్గములను మాత్రమే వ్రాసియుంటినికాని, చికిత్సను గూర్చిగాని ఆయావ్యాధులలక్షణములను గూర్చిగాని వివరించి యుండలేదు. ‘అడుసుద్రొక్కనేల? కాలు గడుగనేల?’ అనునట్లు వ్యాధివచ్చిన తరువాత చికిత్స చేసికొనుటకంటె వ్యాధి రాకుండ జేసికొను ప్రయత్నములనేర్పుట ఈగ్రంథముయొక్క ఉద్దేశ్యము.

ఆంధ్రభాషను జదువనేర్చిన వారందఱును దీనినొక్క సారి పఠించి లాభమునుబొంది నన్ను కృతార్థుని జేయవలయునని మిక్కిలి ప్రార్థించుచున్నాను.

చింతాద్రిపేట,                 ఇట్లు,

౧౨-వ తేది ఆగష్టు ౧౯౧౫         ఆచంట. లక్ష్మీపతి.