పుట:AntuVyadhulu.djvu/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూక్ష్మజీవుల కనుకూలమగు స్థితిగతులు

43


జ్వరమును కలుగజేయు సూక్ష్మజీవులు జిగటవిరేచనములను గలిగించు (B.Coil:) కోలైసూక్ష్మజీవులతో కలిపిపెంచినపుడు టయిఫాయిడ్ సూక్ష్మజీవులు చచ్చును. కాని టయిఫాయిడ్ సూక్ష్మజీవులు కురుపులయందు చీము పుట్టించు సూక్ష్మజీవులతో కలిసి చక్కగ పెంపొందును.

సూక్ష్మజీవులన్నియు పొడిచే ననగా ఆరబెట్టుటచేగాని వేడిచేగాని, మందులచేగాని, తమకిష్టములేనిజంతువుల శరీరములో ప్రవేశింపజేయుటచేగాని తమ బలమును పోగొట్టు కొనును. ఇట్లే కొన్నివ్యాధులకు విరుగుడు పదార్థములను తయారు చేయునపుడు సూక్ష్మజీవుల బలమును తగ్గింతురని ముందుతెలిసికొనగలరు. వెఱ్ఱికుక్కలయొక్క వెన్నెముకలోని పెద్దనరమును తీసి ముక్కలుచేసి కొన్నిముక్కలను ఒక దినమును, కొన్నిముక్కలను రెండుదినములను, కొన్నిముక్కలను మూడుదినములును ఇట్లే నాలుగు అయిదు ఆరుమొదలు పదునైదు దినములవరకు కొన్నిముక్కలను వేరువేరుగ అర బెట్టి ఆముక్కలనుండి రకరకములగు బలముగల టీకారసములను తయారుచేయుదురు. ఇందుపదునైదుదినములు ఆరబెట్టిన ముక్కతో చేయబడిన రసము మిక్కిలి బలహీనమయినది. ఎంత తక్కువ ఆరబెట్టిన ముక్కలతో చేయబడిన రసము అంత బలమయినది.