పుట:AntuVyadhulu.djvu/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

మూడవ ప్రకరణము


20-వ పటము

19-వ పటములోని కొన్ని యుండలలోనుండు సూక్ష్మజీవులు స్పష్టముగ చూపబడినవి. ఇవి గాలినుండి నత్రజనిని పీల్చి భూమికిచ్చి దానిని సారవంతముగ జేయును.

కుప్పలు కుప్పలుగా పడియుండి యీ ప్రపంచక మంతయు నావరించి కంపెత్తకుండ నీ సూక్ష్మజీవులు వానిని సశింపజేయుటయేగాక వానివలన భూమిని సారవంతముగ చేయుచు మన కుపకారులగుచున్నవి. కొన్ని సూక్ష్మజీవులు చిక్కుడు జనుము మొదలగు మొక్కలవేరుల నాశ్రయించియుండి భూమిని సారవంతముగ జేయును. 19, 20-వ పటములు చూడుము. సూక్ష్మజీవులు లేకయుండిన మనపాలు మజ్జిగకాదు. మనకు వెన్న రాదు, మినప రొట్టె పులియదు. మనకడుపులోకూడ ననేకజాతుల సూక్ష్మజీవులు పెరుగుచు మనకు పనికిమాలిన