ఈ పుట ఆమోదించబడ్డది
సూక్ష్మజంతువులు
29
సూక్ష్మజంతువులలో ననేకములు ఒక్కొక్కటి రెండేసిగాచీలి, రెండు నాలుగు, నాలుగు ఎనిమిది, ఎనిమిది పదహారు, ఇట్లు ముక్కలు ముక్కలయి ఒక్కొక్క ముక్క ఒక్కొక్కజంతువుగా పరిణమించును. 9-వ పటముచూడుము.
9-వ పటము
ఒక అమీబా రెండు అమీబాలుగా విభాగమగునపుడు గలుగు మార్పులు. ఒక అమీబాను అనేక ఖండములుగా సోకినప్పుడు ఏఖండము లందు జీవస్థానపు ముక్కలుండునో అవి బ్రతికి పెద్ద అమీబాలగును. జీవస్థానపుముక్క యేమాత్రమునులేనిఖండములు వచ్చును.
మరికొన్ని సూక్ష్మజంతువులలో ఆడది మొగది అను వివక్షత గలిగి ఒకదానితోనొకటి సంయోగము నొందుటచే సంతానవృద్ధియగును. చలిజ్వరపు పురుగులలో నిట్లేమగవియును ఆడవియునుకూడి సంధానమును పొందును. 10-వ పటమును చూడుము.