20
రెండవ ప్రకరణము.
పొర్లబారుచుండును. ఇక్కడ ననేక రకములగు దోమలుమొదలగు వేర్వేరు జాతుల పురుగులు, చల్లదనమునకును ఆహారమునకునుజేరును. ఇంకదొడ్డిలో రెండుచోట్లను మనము వెదుకవలసియున్నది.
పెంటగొయ్యి
ఒకటి పెంటగొయ్యి. పొలములోనికి మట్టి తోలుకొనుటకై యేమూలనో యొక మూల పెద్ద గొయ్యి నొక దానిని పెట్టుదురు. అది త్రవ్విన క్రొత్తరోజులలో నది పెద్దగుండముగా నుండును. వెడల్పుగా త్రవ్వుటకు దొడ్డిలో నంతగా చోటుండదు. వేసవి కాలములో ఇంటిలోని చెత్త, ఎంగిలి విస్తరాకులు, దొడ్లలో రాలిన ఆకులు, దుమ్ము మొదలగునదంతయు చేరి అర్ధసంవత్సరములోనే గొయ్యి రమారమి పూడిపోవును. ఇంతటవానవచ్చి గోతిని నింపివేయును. దీనియొక్క కంపును ఇప్పుడు చూడవలెను. ఒక కఱ్ఱతో ఈతుక్కును లేవనెత్తిన దానిలోపల ఆవిరెత్తుచు వేడిగ నుడుకుచుండును. దాని వాసనను చూచినవారు మరచిపోరు. పిమ్మట వర్షాకాలము రాగానే గొయ్యి నిండిపోయి పెంటకుప్ప నెలనెలకు నేలపై గజముచొప్పున పెరుగుచుండును. ఒకవేళ పశువులపేడ, పెంటయుకూడ ఇంటి దొడ్డిలోనే చేరవలసి యున్నయెడల అడుగ నక్కరలేదు.