161
2. బూదకాలు-ఏనుగుకాలు
(Elephantiasis)
ఈ వ్వాధి కాలునకేకాక చేతికిని, స్తనములకును, జన నేంద్రియములకును కూడ కలుగ వచ్చును. దీనిని బుట్టించు సూక్ష్మ జీవులు కూడ దోమల మూలముననే వ్వాపించును. బూద కాలు గల రోగిని కుట్టిన దోమ కడుపు లోనికి ఆవ్వాధిని కలిగించు సూక్ష్మ జీవుల నెత్తురుతో పాటు పోయి చేరును. మూడవ ప్రకరణము లోని పటములను జూడుము. ఈ దోమలు నీటిలో వడి చచ్చినప్పుడు వాని కడుపులోని సూక్ష్మ జీవులు ఆనీటిలో చేరును. ఆ నీటిని త్రాగిన వారికి జ్వరమును, బూద కాలును వచ్చును. బూద కాలు గల రోగిని కుట్టిన దోమలు ఇతరులను కుట్టి నప్పుడు కూడ ఈ వ్యాధి అంటుకొన వచ్చునని కొందరి అభిప్రాయము.
నివారించు పద్ధతులు
చలి జ్వరమునునకు అనాఫలీసు దోమ ఎట్లు సహకారియో బూద కాలునకు క్యూలెక్సు దోమ అట్లు సహకారి. ఇది వ్రాలి నపుడు కొంచెము గూని గలదిగా అగపడును. బూద కాలును నిర్మూలము చేయవలెనన్న ఈ దోమలను రూపు మాపవలెను. దోమలను సంహరించు పద్ధతులు 'చలి జ్వరము.' క్రింద వ్రాయబడినవి చూడుము.
మనము త్రాగు నీటి యందు దోమలు పడి చావకుండ ఎల్లప్పుడు నీటిని కాపాడ వలెను. త్రాగునప్పుడు నీటిని చక్కగ