Jump to content

పుట:AntuVyadhulu.djvu/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

153

4. ఇతర సంపర్కములచే వ్వాపించునవి: క్షయ, ప్లేగు, కుష్టము, పచ్చసెగ, కొరుకు, గజ్జి, తామర మొదలగునవి.

1. చలిజ్వరము (Malaria)

చలి జ్వరపు సూక్ష్మ జీవులలో నాలుగు తెగలు గలవు. ఒక తెగ సూక్ష్మ జీవులు దినదినమును జ్వరమును కలిగించును. ఇంకొక తెగవి రెందు దినములకొక సారియు, నాలుగవ తెగవి క్రమము తప్పి ఇచ్చ వచ్చినట్లును జ్వరమును కలుగ చేయు చుండును. ఈ జ్వరములను కలిగించు సూక్ష్మ జీవులు జ్వరముగల రోగి నుండి దోమ కడులోనికి పోయి ఆ దోమ యితరులను కరుచు నప్పుడు వారి రక్తములో ప్రవేసించును. 34.వ. పటమును జూడుము. ఈ సూక్ష్మ జీవులక్కడ దినదినాభి వృద్ధి జెంది లక్ష నెత్తురు కణముల కొక్కటి చొప్పున వున్నప్పుడు జ్వరము కలుగ జేయును. మనము అను దినము చూచు దోమలన్నియు చలి జ్వరపు సూక్ష్మ జీవులను జేరవేయవు. అందు అనాఫలీస్ అను జాతి లోని దైన దోమ మాత్రము చలి జ్వరమును చేరవేయును. 35, 36 వ పటములోని దోమలను చూడుము. ఇది వ్రాలినపుడు సిపాయి వలె నిటారుగా నిలువబడును.

నివారించుటకు పద్ధతులు. ఇందుకు రెండు విధములు కలవు.

1. క్వయినా యొక్క సహాయముతో నివారించునవి.

2. క్వయినా యొక్క సహాయము కోరకయే నివారించునది.