Jump to content

పుట:AntuVyadhulu.djvu/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

పదమూడవ ప్రకరణము


యున్నవో దాని నిజమైన వెల యెంతయో మోసగాండ్రమ్మెడు వెల యెంతయో యీ విషయములన్నిటిని కనిపట్టి ప్రతినెల యందు తమ పత్రికలో ప్రకటించుచున్నారు. కాని యిందలి విషయములు వైద్యులకేగాని ప్రజలకు చక్కగా తెలియవు. ఇట్టిదగామందులను అమ్మకూడదని యొక ఆక్టు నేర్పరుపవలయునని పార్లమెంటువారిని బ్రిటిషుమెడికల్ అస్సోసియేషౝ వారు కోరియున్నారు. వారు శోధించినమందు నొక దానిని గూర్చివారువ్రాసినవిషయమును మేముసంక్షేపముగ నుదహరించినయెడల ప్రస్తుతము మన దేశమందెల్ల వ్యాపించియున్న యిట్టి మందుల ప్రకటనలయొక్క నిజమైన విలువ మీకు తెలియగలదు. జాంబక్[1] (Zambak) అనుతైలము పేరు మీరు వినియుండవచ్చును, దీనిని లండనులో నొక కంపెనీ వారు తయారుచేయుదురు. జాంబక్ తైలములో గూడ జాంబక్ సబ్బునుగూడ నుపయోగించుట మంచిదని యీ కంపెనీ వారు సిఫార్సు చేయుదురు. ఈ మందును పంపుపెట్టెలో నీదిగువ కనుపరచినప్రకార మొక ప్రకటన యుండును.

కొన్ని యోషధులనుండి పుండు మాన్పుగుణము మిక్కిలి యధికముగను, అద్భుతముగను గల కొన్నిరసములును మేము గ్రహించితిమి. అధికవ్యయముతో జేరిన శోధ


  1. రహస్యపుమందులు (Secret Remedies) వాల్యూం 1. పేజీ 111 జూడుము.