పుట:Andrulasangikach025988mbp.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గనుక ఈ స్థలాలు సురక్షితంగా నడిపించి శ్రీ విరూపాక్షేశ్వరుని రాజ్యం ప్రసిద్ధి చేసేది. గ్రామాలకు పొలిమేరలు యేర్పాటుచేసి రాయసం వీరమరసును అంపించి శిలాశాసనాలు యేర్పరచిన వివరం.... యీ ప్రకారం పొలిమేరకు శాసనాలు యేర్పరచిన వివరం. బాగా బలవంతులు యెవరంటే.

         శ్లోకం. కరణం, ముచ్చి, కంసాలి, కుమ్మర, కమ్మర, గణక,
              శ్శిల్పక స్వర్ణ మృదయస్కార తక్షకా: | కసారకశ్చ
              భకార శ్చండాలవ్వితలం | తథా నికృష్ణ కార్తి
              కాంచిష్ఠో రజకశ్చ యథాక్రమం, ఏతే
              ద్వాదశజాతీనాం గ్రామభారస్య వాహకా:॥

కర్నూలుసీమలో అడవు లెక్కువగా నుండినందున విజయనగర చక్రవర్తులు మీరాశీ లిచ్చి కొన్ని సంవత్సరాలపన్ను తీసుకొనక ప్రజలను ఆకర్షించి అనేక గ్రామాలను నెలకొల్పిరి. కర్నూలు జిల్లాలోని అస్వరి గ్రామ కరణంవద్దనుండు తామ్రశాసనమందలి విశేషా లేమనగా:-

"శా.శ. 1412 లో సాళువ శ్రీ నరసింగరాయల అయ్యగారు ద్రోణాచలంభూమి, అశ్వంపురిభూమి అరణ్యమై యుండగాను ఇందుకు గ్రామాదులు ఆకారం అయ్యేటందుకు.........యేయే స్థలాలనుంచి యెవరెవరు వచ్చినా ఆ గ్రామాదులు ఆకారం చేస్తున్నారో వారిది కాణియాచ్చి మిరాసులని రాసులు చెల్లించగలవారమని కవులు వ్రాయించి యిచ్చి పంపిస్తేను మలకసీమలోను, గోరంటసీమలోను బిల్ల కల్లుబాణాల అమరువాలు శాతనకోట ధ్యావనకొండ...మొదలైన గ్రామాలనుంచి వచ్చిన అష్టాదశవర్గాలవారు ప్రజలున్నూ బారాబళ వంతులున్నూ, పౌరోహిత మఠపతి జంగాలు తమ్మిళ వారున్నూ, మేటి గొల్లలున్నూ, బోయవారున్నూ, నేశెగమళ్ళు (నేసేగౌండ్లు=సాలెవారు అని యర్థము) మొదలైన ప్రజలున్నూ.... వచ్చి చెరువు బెళగల్లు చేరి స్థాయిచేశి శ్రీరాయలయ్యగారి సముఖానకు వచ్చిన రాయలవారు అనిన వివరం......ఆగ్రామం యెవరు ఆకృతి చేస్తున్నారో వారివే మిరాసులు........యా వచ్చిన ప్రజల్కు గ్రామం చూపించి అష్టదిక్కుల భూమి పొలం యేర్పాటుచేసి, పొలిమేర యేర్పాటు చేసిన నిర్ణయం.........

మిరాసిదార్లను యేర్పరచిన వివరం రెడ్ల నిర్ణయం పాకనాటివారు జనులు భాగాలు 2, మోటాటివారిభాగం 1, నరవాటివారిభాగం 1 అంత 4 భాగాలు......