పుట:Andhrula Charitramu Part 2.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రేరేపించిన నితండు జైనుల ననేకుల జంపించెను. ముప్పైయాఱు జైనగ్రామము లను నాశనము గవించెను. ఈఘోరకృత్యముల నన్నిటిని తిక్కనసోమయాజి ప్రేరేపణముచేతనే జరిగించె నని సొమదేవరాజీయాది గ్రంధములం జెప్పబడినది. గాని యది గాని యది యంతగావ్చిశ్వసింప దగినదిగా గనుపట్టుదు. ఎందుకన తిక్కన సోమయాజి గణపతిచక్రవర్తిని సందర్శించె నని చెప్పబడు విషయము పూర్వగాధలలో గానంబడుచున్నది గాని శాసననాది దృష్టాంతములవలన దెలియంబడ దని తిక్కన సోమయాజి మనుమసిద్ధి రాజులం గూర్చిన ప్రకరణమునం జర్చించియున్నాడను. ఒకవేళ నీగాధయే నిజమైనదైనయెడల నియ్యది క్రీ.శ.1258 దవ సంవత్సరమున జరిగి, యుండవలయును.1 గణపతి చక్రవర్తి యద్వైతవారి యని గణపతిచక్రవర్తి కూతురైన గణపాంబయొక్క యనమదల శాసనములో జెప్పబడినది. గణపతిదేఫచక్రవర్తి కాలముననే జైను లయిన కంసాలులనుండియు, సెట్టిపెద్దలయిన తెలగాలనుండియు గ్రామ కర ణోద్యోగములు దొలగింపబడి నియోగి బ్రాహ్మణుల కీయబదినవి. అంతకు బూర్వము వీరలు బ్రాహ్మణులకు బ్రతికూలముగ నుండుటచేత నిస్పాటు సంభవించినది. దీని నంతయును విచారించి చూడగా గణపతిదేవ చక్రవర్తి యితర విషయౌలం దెట్టి సుగుణాధ్యుడైనను ఈమతవిషయమున సహనము లెని వాడని స్పష్టమగుచున్నది. కాబట్టి బౌద్ధ దేవాలయంబులు జైనదేవాలయం బులు గూలం ద్రోయించె ననియు, జైనగ్రామముల నశింపజేసెననియు, తిరుగ బడిన జైనులననేకుల సంహరించి యనేకులను దేశమునుండి వెడలగొట్టించె ననియు జెప్పెడి గాధలలో జాలవఱకు సత్య గల దని విశ్వసింపవచ్చును.

చెన్నాప్రెగడ గణపామాత్యుడు.

   ఇతడ్  గణపతిదేవుని బ్రాహ్మణమంత్రులలో నొక్కడై సర్వాధికారియై ప్రసిద్ధి గాంచినవాడు గా నుండెను.  ఈమంత్రిశిఖామణి శా.శ.1167

1. ఆంధ్రులచరిత్రముయొక్క ద్వితీయభాగములో 75-79 పేజీలు చూడుడు.