పుట:Andhrula Charitramu Part-1.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రెండవ ప్రకరణమ

ష్యాశ్రమములును అనేక అనేకరాక్షస నివాసస్థలంబులు నిందుండెను. ఈ దండకారణ్యమునకు నుత్తరమున గంగానదియొక్క దక్షిణపుతీరమునువింధ్యపర్వతమును, పశ్చిమమున వింధ్యను, అత్రాశ్రమము దక్షిణకొసలను, మలయాద్రియు దక్షిణమున కిష్కింధారాజ్యమును ద్రవిడ పాండ్యరాజ్యములును తూర్పున నుత్కలకళింగాధ్రచోళదేశములు నుండెను. ఈ దండకారణ్యములో రామునికి ద్రోవజూపుటకు ఋషులు కొందరు వెంటనడిచిరి.[1] రామునికి మార్గమున ననేక ఋష్యాశ్రమములు దగిలెను. కొంతదూర మరిగినతరువాత విరాధునివాసముగానిపించెను. ఇది దండకాంతర్గతము. ఇది మధ్యపరగణాలోని "బిలాసపూరు" జిల్లాలో నీశాన్యపు దిక్కున నున్నది.

ఇచ్చటి నుండి యర్ధయోజనముమీదననగా బదునైదు మైళ్ళదూరమున శరభంగాశ్రమముండెను.[2] ఈ యాశ్రమము వనమునకు దక్షిణమున నాజిల్లాలోనే యుత్తరభాగమున నీశాన్యపుమూలనుండినట్లు గానవచ్చుచున్నది. రాముని దర్శనమైన తరువాతశరభంగు డగ్నిప్రవేశము జేసెను. అచ్చట రాముని జూడ మునులనేకులు వచ్చి రాక్షసులచే జంపబడిన ఋషుల యస్తుల ప్రోవులను జూపగా వారలందరినీ రక్షించెదనని రాము డభయహస్తమునొసగి యచ్చటనుండి సుతేక్ష్ణాశ్రమముకు బోయెను.[3] ఆయాశ్రమమున ఒక రాత్రముండి తరువాత నక్కడనుండి బయలుదేరి త్రోవలో నాశ్రమములు పెక్కింటిని గనుగొనుచు బోయెను. కొంతదూరము గొంతదూరము పోవునప్పటికి నొక గొప్ప సరోవరము గానిపించెను. దానికే పంపాప్సరమని పేరు. రామునకు దారి జూపుచున్న ధర్మభృతు డనుఋషి యాసరోవరము గూర్చిన యితిహాసముగొన్నింటిని వారికి జెప్పెను. మాడపర్ణి ఋషియొక్క తపస్సుచే సరోవరము నిర్మించబడెనట.[4] ఈ పంపాసరోవరము బిలాసపూరు జిల్లాలోనిది.

కొన్ని హేతువులం గనంబరచి జనరల్ కన్నింహ్యాం దొరగారు నిశ్చయించి

  1. (అరణ్య 18 సర్గము)
  2. (28-38-48 సర్గములు)
  3. (68 సర్గము)
  4. (11 సర్గ 1-20)