Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నాడు. ఇచ్చటిమనుజులు ధైర్యవంతులుగను సత్యసంధులుగను, విద్యాసక్తులుగ ఋజువర్తనులుగనుండిరని నుడివియున్నాడు. ఆ కాలమునాటి బౌద్ధసంఘారామములో గొప్పదగు నాలందసంఘారామమున కధిపతిగా నుండి హౌనుత్సాంగునకు గురువుగానుండిన శిలాభద్రునకు బూర్వికుడయి మహాతత్త్వ విచారకుడని ప్రఖ్యాతిగన్న ధర్మపాలునకు జన్మస్థానమగుటచేత కాంచీపురము బౌద్ధులకు బుణ్యక్షేత్రముగ నుండెను. [1] ఆ కారణముచేత నిచ్చట బౌద్ధమతాచార్యులనేకులీపట్టణమును జూడవచ్చుచుందురు. మఱికొంద ఱిచ్చటనే నివసించుచుందురు. ఈ తూర్పుతీరము నందంతటను మధ్యహిందూదేశములోని భాషనే మాటలాడుచున్నారని కూడ వక్కాణించియున్నాడు.

----
  1. Beat, Records, ii, 228. 30,- Life, pp 138.W; Walters, ii,226 8 It-sing, Records of the Buddhist Religion trans Takakusu; pp. XIX,Iviii,179,181