పుట:Andhraveerulupar025958mbp.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్మకు గందారరాజ్యమును బట్టాభిషేకము గావించెను. మాధవవర్మ బంధవిముక్తులగు రాజన్యుల నందఱను గౌరవించి యుచితసత్కారములు గావించి కప్పముల నిర్ణయించి యెవరి రాజ్యమునకు వారల నంపెను. అందొక రాజన్యుడు తన పూర్వనివాసము తెలుపుమన శిరము వంచికొని మాఱుపలక డయ్యెను. అతనిదీనవదన మందఱకు విచారకరముగ నుండెను. మలినాంబరముతో మాసిన తలతోనున్న యాతని యాకారమును జూచి మున్నతని నెటనో కాంచి యుంటిమని ప్రజలు తలంచిరి. మాధవవర్మ యెన్నివిధముల సగౌరవముగా బ్రశ్నించు చున్నను నాబంధోన్ముక్తుండు ప్రత్యుత్తరము నొసంగ డయ్యెను. ఈయంశము నాలకించి సిరియాలదేవి సభారంగమున కేతెంచి యావ్యక్తిని గాంచి నిలువున నీరై నిలువబడి పోయెను. ఆవ్యక్తియు దన్మయుడయ్యెను. కొంతసేపటికి సిరియాలదేవి తెలివి దెచ్చుకొని రాజ్యలక్ష్మీ కలితుడగు కుమారుని హస్తము గొని యాబంధోన్ముక్తుని పాదములపై వ్రాలి, 'రాజన్యా! అజ్ఞాతను, అనన్య గతికను, దీనురాలను కరుణింపు'మని యతని పాదములపై వ్రాలి యశ్రుజలముచే బ్రక్షాళనము గావించుచు, మాధవవర్మా! ఈమహనీయుడె నీజనకుడు. కారాగార పరాభవాదికముచే మిగుల గృశించి యున్నాడు. దైవవశమున దానొందిన దుస్థ్సితిని దలంచుకొని నామ గోపనము గావిం