పుట:Andhraveerulupar025903mbp.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వసింపవచ్చును. స్వామిభక్తిపరాయణతయందును. శూరత్వమునందును నీవీరవతంసుడు ఆంధ్ర వీరసందోహమునందవతంసప్రాయుడై యున్నాడు. ఆంధ్రుల పునరభ్యుదయమున కీవీరుని సంకల్పము దోహద మొసంగుగాక.

______

ప్రతాపరుద్ర చక్రవర్తి.

మన కథానాయకుడగు ప్రతాపరుద్రచక్రవర్తి క్షత్రియ వంశజుడు. వీరాధివీరుడగు నీరాజసింహుని చరిత్రము తెలిసికొనుటకు ముం దీయన పూర్వులను గుఱించి తెలిసికొనుట యావశ్యకము. తొలుత కళ్యాణపురరాజులగు పశ్చిమచాళుక్యులకడ దండనాయకుడుగ నున్న ప్రోలరాజను వీరుడు తద్రాజ్యపతనానంతరము హనుమకొండ రాజధానిగా జేసికొని స్వతంత్రపతాకము స్థాపించి యాంధ్రదేశములో జాలభాగము తన పరిపాలనమున జేర్చుకొనెను. ఈనరపాలుని పుత్రుడగు రుద్రదేవుడు పితృసంపాదితమగు రాజ్యమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. ఈ నరపాలుడు శిల్పములకు లలితకళయగు కవితకు గూడ నభివృద్ధి మార్గముల నన్వేషించెను. ఈయన యనంతరము ఇతని తమ్ము డగు మహ దేవరాయల పుత్రుడు గణపతి దేవుడు రాజ్యమునకు వచ్చెను. ఈనృపుని కాలమునాటికి ఓరుగల్లుకోట పూర్తి