పుట:Andhraveerulupar025903mbp.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖడ్గ తిక్కన.

ఆంధ్రులలో ఖడ్గతిక్కన మిగుల బ్రసిద్ధుడు. ఈతని పరాక్రమజీవితము పల్లెపదములందును జాటు పద్యములందును నిమిడియుండుటచే జిరకాలమునుండి యాంధ్రసోదరు లీశూరమూర్తిని స్మరించుచున్నారు. ఇతడు నియోగి బ్రాహ్మణుడు. సిద్ధనామాత్యునకు బోలమాంబకు జనించిన యేడుగురు కుమారులలో బెద్దవాడు. గౌతమస గోత్రుడు. భారతమును రచించిన తిక్కనసోమయాజితండ్రియగు కొమ్మనామాత్యుడును, ఈవీరుని తండ్రియగు సిద్ధనామాత్యుడును నొక తల్లిబిడ్డలు. గాన నీవీరులిద్దరు నన్నదమ్ములు కొమారులు. ఖడ్గతిక్కన బాల్యమున సంస్కృతాంధ్రభాషలభ్యసించి రాజనీతిశాస్త్రమునందును. ధనుర్విద్యయందును బ్రసిద్ధిగడించి యాకాలమున బ్రసిద్ధుడై నెల్లూరురాజ్యమును బాలించుచున్న మనుమసిద్ధి నృపాలుని యొద్ద సేనానాయకుడుగ నుండి యాతడు గడించిన విజయము లన్నింటికి దానె యాధారమయ్యెను. ఈవీరవతంసుడు విద్యా వితరణ విక్రాంతులలో నిరుపమానుడై విక్రమసింహపుర రాజ్యమును, దానొక్కండె భుజపీఠిపై ధరించెనని చెప్పుదుమేని యిందతిశయొక్తి కలదని చరిత్రవిదులు వాకొనలేరు.

ఖడ్గతిక్కన మనుమసిద్ధి కేయేసంగ్రామములలో నెంతెంత సహాయపడినో నిర్ణయించు నాధారములు లభించుట