పుట:Andhraveerulupar025903mbp.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

సహృదయులారా ?

ఆంధ్రవీరరత్నావళి యను పేరుతో ఆంధ్రులందు బ్రసిద్ధులైన లోకోత్తర పురుషుల జీవితములు కథలుగ వ్రాసి బాలురకు పద్యార్థిదశలోనే మాతృదేశాభిమానము గలిగించుట యుచితమని యీ పుస్తకమును వ్రాయ దొరకొంటిమి. మాయుద్యమము వే. సత్యనారాయణమూర్తి గారి వలన విని వేంకటరాం అండుకో వారు తాము స్వయముగ బ్రకటించి కొందుమనియు ద్వరలో బూర్తిచేయుమనియు, బ్రోత్సహించిరి. వారి యాదరణము నూతగా గొని ఉన్నత పాఠశాలయందలి మా పండిత పదవి యందలి యనుభవమును బురస్కరించుకొని యీ చరిత్ర కథాగ్రంథమును రచించితిమి.

విస్తృతమగు నాంధ్రదేశమునందు బలువురు మహనీయు లుద్భవించిరి. వారి త్యాగదీక్ష, కౌశలము ప్రపంచమునందలి యేజాతీయ నాయకునకు దీసిపోవదనుట కీ చిన్నిపొత్తము సాక్ష్యము గాగలదు. ఆంధ్రవీరుల వికాసము, రాజ్యవిస్తృతి. పతనము క్రమముగా నీపుస్తకమునందు దెలుపబడినవి. ఆంధ్రుల చరిత్రము చాల వఱకు బురాణ యుగమున నజ్ఞాతముగ గున్నదనుటకు జాణక్యుని చరిత్రమును దార్కాణముగ దీసికొన వచ్చును. తరువాత నాంధ్రులు జాతీయతా ధర్మ నిర్వహణ ప్రవీణులై పొందిన మహత్తరమగు నభ్యున్నతికి గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్రము దృష్టాంతము. తరువాత బశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు తమలో దాము పోరాడుకొనుటయు జోడులు విజృంభించుటయు జరిత్ర విశేషములు. వీనిని గమనించితిమేని అసల నాంధ్రదేశము నంతయు నేకధాటిగ బాలించిన వీరుడు కులోత్తుంగ ఛోళదేవుడు. ఈతని యనంతరము ఆంధ్రదేశమును జీలికలు గావించుకొని