పుట:Andhraveerulupar025903mbp.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామరాజు

కృష్ణదేవరాయల మరణానంతర మాతనిసవతితల్లి కుమారుడగు నచ్యుతదేవరాయలు విద్యానగర సామ్రాజ్యధిపతియై క్రీ.శ. 1530-1542 వఱకు రాజ్యము పాలించెను. భోగలాలసుడగు నీనృపాలుని కాలమున విజాపురమునవాబు దండయాత్రయొనరించి ముదిగల్లు, రాయచూరు దుర్గముల దీసికొనెను. రాజ్యములోని భాగములుగూడ దోచెను. తనసుఖమున కేమిభంగము వాటిల్లునోయని అచ్యుతరాయలు నవాబుతో సంధి గావించుకొనెనేగాని సంగరమున కెన్నడును యత్నముగావించి యెఱుంగడు. అచ్యుతరాయల రాజ్యమున కాతనిబావమఱది సలకము తిమ్మయ ముఖ్యమంత్రిగ నుండెను. అచ్యుతరాయలమరణానంతర మతనికుమారుడగు వెంకటపతిరాయలు రాజై కొంతకాలము రాజ్యమును బాలించెను. సలకము తిమ్మయ్య మాయోపాయములచే వేంకటపతిరాయలను జంపించి తానె విద్యానగర సామ్రాజ్యమునకు బ్రభువయ్యెను. సేనాధిపతులు పౌరులు సలకము తిమ్మయ్యకు దిరుగబడి కృష్ణదేవరాయల యల్లుడగు రామరాజునకు వర్తమానమంపి సామ్రాజ్యోద్ధరణము గావింపుమని కోరిరి. పెనుగొండ నుండి రామరాజు సైన్యముతో విద్యానగరమునకువచ్చి యధికారుల గూడగట్టుకొని సలకము తిమ్మయ్యను బంధించి