పుట:Andhra bhasha charitramu part 1.pdf/810

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

      కరి పుండరీక వృక కా | నర శశ భల్లూక హరిణ చమరీ హరి సూ
      కరఖడ్గ గవయ వలిముఖ | శరభ ప్రముఖోగ్ర వన్య సత్త్వాశ్రయమై.
                                            భాగ. III. 769 - 771.

శ్రీనాథుడు విద్వత్కవి; సంస్కృత విద్వత్కవి; తెనుగు నుడికారమును స్వవసము చేసికొన్నవాడు. అతని కవితయం దచ్చటచ్చట, నుచిత స్థమములందు, దీర్ఘ సమాసములు ప్రవహించుట వింతగాదు.

      "కింకుర్వాణ పురందరాదిక మహాగీర్వాణ కోటీ కిరీ
       టాంక స్థాపిత నూత్నరత్న రుచిథారాశ్లేష కిమ్మీరప
       త్పంకేజుండు హరుండు జంతువులకుం బ్రాణాంతకాలంబునం
       దోంకారాక్షర మంత్రరాజము జెవిన్ యోజించు గాళీస్థలిన్." కాశీ. III. 95

      "అదెమాస్వామి సుధారసోద్భవుడు దక్షారామభీమేశు డ
       భ్యుదయంబొంది ప్రతిష్ఠ గైకొనెడు సంబోరాశి తీరంబునం
       బదమా షట్పదమాలికా పశిలసత్పాథోధునీ సంపదా
       స్పద నానా సలిల ప్రవాహలహరీ సంభార గోదావరీ." భీమ. III. 47.

కృష్ణదేవరాయల యాముక్తమాల్యదయందు దీర్ఘసమాసము లనేకము లున్నను వానియందు మార్దవము తక్కువ. సాధారణముగ దెనుగు కవు లందఱకును దీర్ఘ సమాసఘటనమునందు ప్రీతిమెండే కాని, దాని నొక కళగా దిద్ది తీర్చినవాడు రామరాజభూషణుడు.

     "పవమాన మానవ ప్ల వమాన కైరవ చ్యవమానరజము మైసంటదివురు
      గరపారపాగ్ర తామరపాతిపాంద్ర సీధురపాప్తి గన్నీరు దుడువగోరు
      మదనావలప్రభా సదణామ్ర కోమలచ్ఛదనార్చిపై జూపు జరపజూచు
      సలయాహత లతా కిసలయాగ మలయాగ నిలయానిలున కూర్పుదెలుపదలచు
      గుంజపుట గుంజ దళిపుంజ శింజితంబు, వెగ్గలంబైన జెవియొగ్గి వినగడంగు
      బంచ శరభూత పరిభూత పంచభూత, ముల దదీయస్థలంబుల గలుపు కరణి.
                                               వసు. III. 118.

రామరాజభూషణునితో నాంధ్రకవిత్వమందు ప్రతిభ కనబడుట తగ్గినది. తరువాతి తెనుగుకవులందఱును బూర్వకవులరచన ననుకరించిన వారే. ఈ సంస్కృత సమాస రచనావేశమును బ్రతిఘటించుటకో యన నచ్చ తెనుగు గావ్యములు బయలుదేరినవి. చేమకూర వెంకటకవి యచ్చ తెనుగు కావ్యముల యస్వాభావికత్వముపై రోతగొని చక్కని దేశికవితకు దారి చూపినాడు. అతడును నతని ననుకరించినవారును తెనుగు రచనకు బ్రాధాన్యమునిచ్చి సంస్కృతము నొక నియమముతో మితముగ వాడుకొన మొదలిడిరి.