Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

124 ఆ ం ధ్ర నాటక ప ద్య పఠనం 6 సంగీత సాహిత్యాల సంబంధం గురించి ఒక శ్లోకం మిక్కిలి తరుచుగా వినిపిస్తూ ఉంటుంది. సంగీత మపి సాహిత్యమ్ సరస్వత్యా స్తనద్వయమ్ ఏక మాపాతమధురమ్ అన్య దాలోచనామృతమ్. రాగాన్ని సంగీతంలోనూ, పద్యాన్ని సాహిత్యంకిందా జను కట్టుగుంటే, సంగీతం (చెవి మీద పడగానే తియ్యగా ఉంటుందనీ సాహిత్యం యోచనతోకూడిన మరొక దినుసనీ ఈ శ్లోకం వాటిని కేటాయించి చెబుతోంది. 7 పై శ్లోకాన్నే మనస్సులో పెట్టు గుని, వసుచరిత్రకారుడు చెప్పిన పద్యం: సకలామోదక తాళవృత్తగతులన్ సంగీతసాహిత్య నా మక విద్యాయుగళంబు పల్కు ఁజెలికిన్ బాలిండ్లజోడై సిరుల్ ప్రకటింపన్ నఖ రేఖలందు నలఘు ప్రస్తారముల్ సేయు సర్వ కలాకాంతుఁడు ప్రోచుఁ దిర్మల మహారాయ క్షమాపల్లభున్ ఇందులో ప్రస్తుతాంశం ఉపమేయాలే. సంగీతపరంగా - సకలామోదక తాళ గతి సాహిత్యపరంగా-స-కలామోదక వృత్తగతి. మళ్లీ సంగీతపరంగా తారగతిలో గురులఘు ప్రస్తారాలు మళ్ళీ సాహిత్యపరంగా– వృత్త గతిలో గుకులఘుప్రస్తా కాలు,