Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అ న Đવુ లు 115 వేసుకునే ధరించే సమయాల్లో పదాలు వేరు వేరువే నీరుస్తారు గాని, వేషం అదే, పాడే రాగాలు అవే. కాని, సంగీత నాటక ప్రదర్శన సభ్యులకి పదాలమీద ఖాకరీయే లేదు. తక్కిన తెరలూ, వేషాలూ, రాగాలూ, ఎప్పటివే, వాటిలో మార్పు ఏమీ లేదు. అందుకని, తమ కళ్ళముందు జరిగేది హరిశ్చంద్రో, చిత్రనళీయమో, మరోటో జనం మరిచిపోతూ అరుస్తూండడం జరిగేది. కొందరికి అన్ని నాట కాలూ ఒక టే. పాతి గేళ్ళపాటు సంగీత నాటకాలు చూసిన ఒకాయన చిత్రనళీయం జరుగుతూంటే 'ఛెస్, తగలేస్తున్నా డ్రా హరిశ్చంద్రుడు' అనేవాడు. ఆ వ్య క్తే, ఆ చక్కూ కోటే వేసుగుణ, ఆ తెర ఎద టే, ఆ రాగమే రేవెట్టి పాడేస్తూండడం వల్ల! దీన్ని బట్టి, సంగీత నాటక ప్రదర్శనాల్లో, పాత్రధారులు తమరే కః పిస్తూ తమరిని బట్టి పాత్రల్ని మారుస్తున్నారుగాని, కవి పాత్రకి కేటాయించిన పదాలవల్ల తమరు మారిపోయి కనపడాలని యత్నించడం లేదన్న మాట. ఇంకో విషయం. పాటకచేరీలలోనూ హరికథల్లోనూ, ఆ పాట కుడి యొక్కగాని హరిదాసు యొక్కగాని గాత్రం తూగడాన్ని బట్టి ఫలానా శృతి అని వేసుకోడం జరుగుతుంది. ఆ శృతి ప్రారంభంలగా యతు అంతంవరకూ ఎడ తెరిపిలేకుండా మోగుతూనే ఉంటుంది. కొన్ని పాటకచేరీలలో ఉత్త రాదిగానం చెయ్యవలిసొచ్చినప్పుడు (రక్తి కోసంట ) ఉన్నశృతి ఆపకుండానే మధ్యమం తగిలిస్తారు. కాని సంగీత నాటక ప్రదర్శనాల్లో ధోరణే వేరు. వాటిల్లో అపశకునమూ ఎదురుదెబ్బా లాగ వచనం వస్తూంటుంది. ఆ కారణం చేతట, శృతి మా నేస్తూంటా! 'శృతి ' పూర్వంమాట, ఇటీవల ' శృతులు ’. పాడేవాళ్ల నిబట్టి శృతులు మారుతూండాలి. శృతులు మారే దోసందులో అపశృతిలో పద్యం అందుకోడం సంభవించవచ్చు, అందులోనే పద్యం యావత్తూ సాగ వచ్చు. అయితేం హార్మోనియం పుట్టింది, అది జోరుగా వాయించే