21 కాలు 111 అందియ్యాలి. అటువంటి అందింపులు ఒక్క రవ్వ మరీ ఎక్కువగా పుచ్చు గునే వాళ్లుంటారు..' నేను 'టీ' లో పంచదార ఒక్కరవ్వ ఎక్కువే వేసుగుంటాను' అన్నట్టు! ఒక రకం నటులు ముక్కల అందింపు గుడా ‘తోడి'లో నే యి స్తేతప్ప అందుకోనేలేరు - ఇంగ్లీషు భాషలో చెబితే గాని తెలుగు గ్రహింపుకాదు, అన్నట్టు! అందుకని ఒక అందింపుగాడు తెరపక్క పుస్తకం పట్టుకుని హమేషా నుంచుని, నటుడితో, 'నువ్విక్కడ ఏడవాలి, ఇక్కడ కోప్పడాలి ఇక్కడ భయపడాలి' అనే మోస్తరుగా ఇచ్చే సంజ్ఞల్ని అనుసరించి, ఆ పన్లు చెయ్యడానికల్లామూలం రాగాలు తీసేవాడు నటుడా ? కాని, ఎటువంటి అఖండధారణ గలవాడికై నా మరిచి పోవడం అనేది ఉండవచ్చు. ప్రమాదం మానవత్వంలోనే ఉంది. అయినా ఒకమాట చెప్పవచ్చు. అర్థభావాల మీద అధారపడే ధారణ రాగసంబంధ ధారణ వట్టిపోయినంత తరుచుగా వట్టిపోదు. అందుచేత నే కాబోలు, పాపం, కొందరు సంగీతనటు పాతి గేళ్ల పాటు ఒక రాజు వేషం వేసిన వాళ్లయినా, మళ్లీ ఆ రాజు వేషంలోనే నేడు రంగం ఎక్కినా, వాళ్లకి యథాప్రకారం అందింపు (ప్రాంక్టింగ్) ఉండితీరాలి. అందుచేతనే కాబోలు, అర్ధం చూడవలిసిన అవసరం చొప్పున మనం ఇతర భాషల్లో కంఠపాఠం చేస్తూండే పద్యాలు అంతత్వరగా మరువు రావు, క్రియముక్క, మరిచిపోవడం గురించి నిర్ధారణలు చెయ్యడం శక్యం కానిపని అయినా, ఇంతమాత్రం అనవచ్చు. రాగంతో జోక్యం లేకుండా పద్యాన్ని కంఠపాఠం చెయ్యడం నటుడికి తప్పనిసరి అయి నప్పుడు, అతడికి పద్యం ఇప్పటికంటె దృఢతరంగా జ్ఞాపకం ఉండడమే కాక, తను రంగంమీద పద్యం ఉన్నప్పుడు ఏమిచెయ్యాలో (తలా చేతులూ తిప్పడంమాని) కూడా ఇప్పటికంటె ఎక్కువగా తెలుస్తుంది. కవిహృదయం గ్రహించుగునే వరకూ పద్యం చదువుకున్న నటుడికి పద -మధ్యంలో అందింపు కావలసి రావడానికి కారణం కనిపించదు.
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/136
స్వరూపం