అనర్ధాలు 109 గాని, పాత్రల్నీ మనస్సులో పెట్టుకుని కాదు. గానకర్తృత్వం పాడేవా డి దేగనక, పాటలు రచించిన నాటకకర్త నాటకకర్తృత్వంలో కొంత భాగం మరొకరికి ఇచ్చినవాడవుతాడు. గద్యనాటకకర్త గద్యలో నే రచిస్తాడు. పద్యనాటకకర్త సమగ్రంగా పద్యరూపంలోగాని, గద్య మిళి కంగాగాని రచనచేస్తాడు. కవనగానరహస్య వేది కీర్తనరచన చేస్తాడు, కాని హడావిడిగాసందర్భాలు జరిగిపోతూ సంగతులు చెప్పబడుతూండే నాటకరంXఁమీద అన్యపాత్ర రూపించే వాళ్లకోసం రచించడు. అట్టి వాడు విడికీర్త న లై నా రాస్తాడు. లేదా ఏదైనా పౌరాణిక గాధ భక్తి పరంగా ప్రజకి వినిపించడానికి, గాన బాధ్యత యావత్తూ ఒకడిమీ దే ఉంచి గేయాలుకుడాగల పదరచన చేస్తాడు. అదే 'హరికధ : కాబట్టి, నాటకంలో సాధారణంగా గద్యపద్యాలు ఉంటాయి. ఆ రచ నని ఎంత అనుసరిస్తే అంత గొప్పునటుడు కావలసినమాట. అయి తేం, అట్లా జరుగుతూండదు, అందుకు విలోమంగా విలువ కడుతూంటారు, సంగీతనాటక ప్రదర్శనశ్రోతలు. పద్యాలు పాడడం వల్ల పద్యంలో ఉండగల శబ్దాలంకారాల మీద ద్వేషం జనించింది. రాగసౌఖ్యం విర్రవీగి నిరంకుశమై పద్యప దాల నాదసౌఖ్యాన్ని కిందు చెయ్యడం కాదు. శూన్యపరిచింది. పద్యం పాడేటప్పుడు పదాల అర్థాలు ఎల్లా గమనించరో, అట్లాగే ఒక శబ్దం లోని వర్ణ సాహచర్యంవల్ల గలిగే నాదంకాని ఒక పాదంలోని పదసాం గత్యంవల్ల పుట్టగల నాదంగాని సభ్యులు వినిపించుకోరు. వినిపించుగో కుండా తయారయారు సభ్యులు - అహఁ, తయారు చేశారు సభ్యుల్ని ఆంధ్రకవులలో నాదసౌఖ్యం ఎరిగిన కవులెవరో, అది వాళ్లే రీతిగా కల్పించారో గమనించే యత్నం ఆంధ్రులు చెయ్యరు. ఎవరేనా ఒక పద్యంలో కొన్ని రాగాల పేర్లు వచ్చేటట్టు రచిస్తే, వారికి నావరహస్యం తెలిసి నటే ? రాగాలు తెలియడం అంటే కాగాల పేర్లు తెలియడమా !
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/134
స్వరూపం