Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాద ప్రతివాదన

83

తెరలపని ఎన్నడూ చూడడు, పద్యం మాట్టాడే కాలంలోనూ చూడడు. చివరికి దమయంతి, సావిత్రిపాత్రలు ధరించే వ్యక్తులకైనా, భర్తల చిత్రపటాలు చిత్రించారని కథల్లో ఉన్నా, చిత్రాలు రచిం చడం రానక్కర్లేదుట! ఇదీ చిత్రరచన సంగతి! ఇక, నటుడు తను పద్యంలో ఉండేముక్కలు చెప్పి అభినయించవలిసిన అవసరంలో రాగం చుట్టుగోడం ఎందుకూ గొంతిక్కి? అల్లా చేస్తేగాని కళల సంపుటి సిద్ధించదా? అల్లాచేస్తే సిద్ధించదా? అతడు పోషిస్తూన్నది ఏ కళ? ఏ కళవల్ల ఇన్నీ వచ్చాయో, దేనివల్ల తను జనించాడో దాన్ని యధాగమనంతో ఎదటివాళ్ళకి మొట్టమొదట శ్రుతం చేసిన మీదట కదా కవి సృజించినపాత్రకి జననం ? అందునిమిత్తం చూపించ గలిగిన శ్రద్ధ చూపించి, చేయగలిగినంత ధ్యానం చేసి, తద్వారా తన మనస్సూ వాక్కూ చేష్ట మార్చుకోగలిగినంత మార్చుగుని, ఆ మార్పు నిలబెట్టుగుని, పోషించి, దాని పరమార్ధం తను గ్రహించి, గమనించి, ఆచరించి, సభాసదుల్ని రంజింపజేస్తున్నాడా ? అనగా, కవిత్వాన్ని అతడు గౌరవిస్తున్నాడా ? మూడుకళల సంపుటీముచ్చట సంగతి అల్లా ఉంచండి. తాళగమనం లేకుండా, పద్యగమనానికి భంగం రానీకుండా, రాగసంపుటి చేయగలడా ఎటువంటి అపూర్వసంగీతనటుడైనా?

'గానం దేవకళ. నాటకరంగాన్నించి దానికి స్వస్తి చెబితే అది నష్టం అవుతుంది. ఒక్కొక్కరి యిష్టానుసారం ఒక్కొక్క కండ తీసివేయుటకు వీలులేదు. అట్లుచేసిన నాటకప్పాకలు తగులడి పోవును, అని ఒకరిబాధ. ఉచ్చారణలో పద్యంయొక్క ప్రత్యేకజన్మ గురిం చినది చర్చావిషయం. నాటకరంగం ఒక రకం కాదు. ఇదివరకు భాగవత రంగం, వచన రంగం, సంగీత రంగం ఉన్నాయి. పద్య నాటక రంగంగురించి మన తర్జనభర్జన. గానం దివ్యకళే. అది రంగం మీద ఉండావచ్చు. ఒక పద్యానికి బయటినించి తెచ్చి తగి