పుట:AndhraRachaitaluVol1.djvu/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముడుంబ నృసింహాచార్యకవి

1841- 1927

శ్రీవైష్ణవులు. తండ్రి: వీరరాఘవాచార్యుడు. జన్మస్థానము: శ్రీకూర్మము దగ్గర వంశధారా తీరస్థమగు అచ్యుతపురి. జననము: ప్లవంగ సంవత్సర భాద్రపద బహుళ నవమి 1841 సం||రం సెప్టెంబర్ 22. నిర్యాణము: ప్రభవ సంవత్సర భాద్రపద బహుళ ద్వాదశి. 1927 సెప్టెంబరు 22 తేదీ. గ్రంథములు: 1. రంగేశ శతకము. 2. ప్రౌఢా శృంగారము. 3. ముగ్ధా శృంగారము. 4. కామినీదృష్టి శృంగారము. 5. అంగశృంగారము. 6. సంకీర్ణ శృంగారము. 7. శ్రీకృష్ణచాటువులు. 8. సత్య శతకము. 9. వృష్టిపంచాశక్తు. 10. గరుడాచల నాటకము. 11. కృతులు. 12. హరికథలు- సంస్కృత గ్రంథములు: 1. బ్రహ్మసూత్ర భాష్యము. 2. బ్రహ్మసూత్రరోమధము. 3. ప్రపత్తి చింత. 4. నృసింహ శారీరక భాష్యము 5.ఉజ్వలానంద చంపువు 6.వాసవ పరాశరీయ నాటకము. 7. జయసింహాశ్వమేధీయము. 8.. చిత్సూర్యాలోకము. 9. కావ్యసూత్రవృత్తి-ఇత్యాదులు. వీరు సంస్కృతమున వ్రాసిన తత్త్వగ్రంథముల సంఖ్య 22. సాహిత్యగ్రంథములు 14, నీతిశాస్త్ర రచనలు 2.

శ్రీమన్నరసింహాచార్యస్వామికి 'భగవత్కవి' యని బిరుదము. సింహాద్రినాథు నీయాచార్యు డుపాసించుచు దనకృతులు నన్నిటి నాతనికే యంకితముచేసెను. ముప్పదియేండ్లయీడున నున్నపుడొకప్పుడు వేదవ్యాసులు వీరికి గలలో గనబడెనట. స్వప్నమున వచ్చినదేవులగు------నడిగినట్లు వీరిని కృతి యడుగలేదు. వచ్చి దర్శన మిచ్చి--------అప్పటినుండియే యీయనలో నార్షప్రతిభ రేకెత్తెను. .... ...... కేశవస్వానుబు ..... ..... ....... ............ ............ ( ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)