ఈ పుట ఆమోదించబడ్డది
"మన చౌదరి యతిప్రాసములకై భంగపాటుచెంది తలగోకికొనుచు బలాత్కార పద ప్రయోగములుచేసి, యర్థము ననుసరించి పదములు వాడక, పదములబట్టి యర్థమును వంపులుపెట్టి వంగజేయు నీరనుడుగాడు. భావ మనర్గళముగా బ్రవహించు చందనా వ్రాయు మహనీయుడు. యతి పదాదియందేకాక మధ్యమునను గొసలువ్రాలును. ప్రాసమునకు యతికినై పద్యము నడక నిలిచి దాటవలసిన యిబ్బంది లేదు. అర్థమునుబట్టి పదములు, పదములలో లీనమైనరీతిని యతిప్రాసములు ననాయాసముగ నప్రయత్నముగ, స్వచ్చందముగ వచ్చి చేరు చుండును. ఈసిద్ధియందు బ్రసిద్ధుడు తిక్కన. ఈవర్గమున తిక్కనతో సజాతీయుడైన వాడు మన చౌదరి. అనగా సరిసమానుడని యతిశయోక్తి, బలికి ప్రమాదము దేను. ఆవర్గమున నగ్రానసత్వము లేకున్నను నానసత్వము కలవాడని నామనవి"
______________
______________________________________________________________________
సరస్వతీ పవర్ ప్రెస్, రాజమహేంద్రవరము - 1950