Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/557

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకృతము : అద్యతనాంధ్రకవులలో వేదుల సత్యనారాయణశాస్త్రిగారి స్థానము మంచిది. ఆయన ప్రతిభ సమంచితమైనది. వ్యుత్పత్తియు దానికి దీటయినదని తెలిసికొంటిమి. దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభృతుల చెలికారముతో నీయనకు పాశ్చాత్య కవితారామణీయక మాకళింపునకు వచ్చినది. తనకు, ఆజానజమైయున్న ప్రాచ్యసాహిత్య ప్రతిభ కా యదృష్టము తోడైనది. ఈసన్నివేశముతో నెన్నో ఖండకృతులీయన సంతరించెను. పదముద్రలో నీకవి బహుభద్రత గలవాడు. పలుకుబడి చిక్కగా, చక్కగా, కుదిరికగా నుండును. సంస్కృతవాణిపై మక్కువ పెంచుకొన్నను, వాడిన తెనుగునుడి యెంతో ముద్దుగా నుండును. భావన లోతుకలది. ప్రాక్తన సంప్రదాయములకు సమీపస్థుడై, క్రొత్త చవులు పుట్టించునట్లు కవిత్వము కట్టుటలో ' వేదులకవి ' మంచినేర్పరి. ఆనాడు శ్రీనాథుడు సీసములకు బేరుపడినట్టుగా, ఈనాడు ' వేదుల ' వృత్తములకు బేరుపడెను. శయ్యాసౌందర్యము చంపకుండగా జాగ్రత్తగా, మునువెనుకలు చూచుకొని వ్రాయుట యీయనలో నలవాటు. అందువలన, ఆయనప్రతిపదము మలయమారుతమువలె చదువరిని సుఖపెట్టును. ఈమార్గమునకు సంస్కృతకవులలో జయదేవుడు తెనుగు కవులలో ముక్కు తిమ్మనగారు దర్శకులు. వేదులవారి ' విముక్తి ' కావ్యమునుండి మూడు ముక్తలు.

ప్రాకుల్ వెట్టిన చిమ్మచీకటుల యీపాషాణ కారాగుహా
ప్రాకారమ్ములు వ్రీలి నాబ్రతుకుపై ప్రాభాత శోభామయా
శాకాంతిప్రసరమ్ము సాగెడిని స్వేచ్ఛామారుతాహ్వాన గీ
తా కోలాహల మేదో నాయెడద నుత్సాహమ్ము లూగెంచెడిన్.

ఊపిరి యాడనీని కఠినోపలబంధములో, కలా కలా
లాపముగాని, నర్తన విలాసముగాని, ధరా పరీమళా