పుట:AndhraRachaitaluVol1.djvu/505

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ కాటూరి వేంకటేశ్వరరావుగారిదియు సుపరినిష్ఠితమైన సారస్వతవ్యాసంగము. ఆయన భోగ త్యాగములకు వలయునంత యున్నవాడు. ఆదిలో, వీరు కలపటపువారు. నాలుగైదు తరములుగా 'కాటూరు' చేరిన తరువాత 'కాటూరి' యని యింటిపేరు మాఱినది. పినముత్తాతగారికి దత్తుడై వేంకటేశ్వరరావుగారు పెంపొందెను. సంపత్తితోపాటు మహాకవిత్వమునకు వలయునంత వ్యుత్పత్తియు నున్నవాడు. గురువుల నాశ్రయించి చదువుకొన్నవాడు. పింగళి కవియు, నీయనయు నతీర్థ్యులు కావుట విశేషము. వీరికిని చెళ్ళపిళ్ళశాస్త్రులుగారే సంస్కృతాంధ్ర సాహిత్యభిక్షా ప్రదాతలు. వేంకటేశ్వరరావుగారు బి.ఏ సీనియరు చదువురు. 1921 లో, సహాయనిరాకరణోద్యమమున జదువు విరమించివైచిరి. 1930 లో జరిగిన యుద్యమమున నాఱు నెలల కారావాసదండనము. కాటూరికవి దంతటి దేశాభిమానము. 1932 మొదలు 39 వఱకు ఆంధ్రోపాధ్యాయుడుగా, 39 సం. మొదలు 43 సం. దాక ప్రిన్సిపాలుగా బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో నుద్యోగనిర్వహణము. ప్రకృతము కృష్ణాపత్రికా సంపాదకత. ఆంగ్లభాషలోని యుదాత్త సాహిత్యము నీయన తనివార జూఱలాడియు, నార్యసంప్రదాయములు వీడక కవితాగ్రంథనము గావించెను. కావలసినంత స్వస్థాన వేషభాషాభిరతి కల వ్యక్తి వేంకటేశ్వరరావుగారు. మెత్తని హృదయము, మఱీమెత్తని పలుకుబడి. ఒడలెఱుగని యుపన్యాసధోరణీ సాగించు గుణములేదుకాని, తియ్యతియ్యగా బద్యపాఠముచేసి సభ్యుల నూరించును. నిర్లిప్తుడు ; ఒకరి లక్ష్యములేదు. అట్లని, ఎవరిని జెందనాడడు. వచనశైలిలో పింగళివారిది, పద్యశైయ్యలో కాటూరి వారిది పై చేయిగా నుండునని దేశమున బలుచనైన యొక వాడుకయున్నది. రసజ్ఞల చెవుల కిట్టి వాడుకలు విన బడవు. వారిరువురిది సరియగుజత. సౌందరనంద