ణకు వత్తురు. పంతులుగారు పేరుగొన్న చరిత్రశోధకులే. వారి కవితాకళాభిరతియు జగద్విఖ్యాతము. కావ్యములు, ప్రహసనములు, నవలలు, నాటకములు వందలుగా రచించిరి. వారివలెనే పరిశోధనశక్తికి దోడు కవితా సౌందర్యము నుపాసించిన కవులు నారాయణరావుగారు. వీరి 'అంబ' - 'అచ్చి' మొదలయిన నాటకములకు దెలుగునాట బేరువచ్చినది. నవ్యసాహిత్యపరిషత్తు సంస్థాపకులలో, అధ్యక్షగణములో నారాయణరావుగా రొకరు. అభ్యుదయ రచయితలలోను వీరికి సభ్యత యున్నది. అనగా ఆధునిక సాహిత్యదృష్టి వీరి కత్యధికముగా నున్నదనుట. ఆయన పద్యములు ఛందో బంధమున వ్రాసెను. పాటలును వ్రాయును. 'మహానటుని మయూరనృత్యము' అను పేరుతో కాశిలో జరిగిన అఖిల భారత రచయితల మహాసభలో ఆశువుగా బాడినగేయ మొకటి నారాయణరావుగారు ప్రకటించినారు. అది కొన్ని చరణములు మనవిచేసెదను. అఱువదియేండ్లు నిండిన రావుగారు, ఈపాటలో ఇరువది యేండ్ల యువకుడై కనిపించుచుండె నని నా కానందము.
ఈసదామహాశ్మశాన - వాసి కాశికావిభుండు
విశ్వనాధుడిపు డిదేమొ - యీ చిదంబర ప్రచండ
కాలమేఘరాశి జూచి - యానందం బంతకంత
కతిశయింపగా మయూర - నృత్యముతో మూదలించి
నందికేశనాట్యరీతి - డుంఠినాధ లాస్యఫణితి
మించి తాండవించె నే డిదేమొ - రండు, గణనాధులు!
*
కాళ్ళకు గజ్జెలు - కటిపై పులితోల్
హస్త, కంఠ, భుజ - మస్తక పూత్కృ
త్సర్పభూషణుడు - మహానటుడు
నృత్యమాడు లాస్యమాడు తాండవించు