పుట:AndhraRachaitaluVol1.djvu/448

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఱకు మోటుగానుండును గాని, కవితావిమర్శకున కుండవలసిన లక్షణములలో నిదియొక మంచి లక్షణము. ఆయన విమర్శనములో బాశ్చాత్య సంస్కారవాసన పాలు చాలగా గనుపట్టుచుండును. అట్టులని, వారి సంస్కృతులన్నియు నితడు సహింపనేరడు. సహ్యముగాని శృంగారవర్ణనములు చేయుటను రామలింగారెడ్డి రోయును. ఈత్రోవకు గుఱిగాని వారొక భారత కవులే. వారిలోను 'కవిబ్రహ్మ' రెడ్డిగారి దృష్టిలో విశిష్టుడు. "ఆంధ్రలోక పరిశుద్ధ తపఃపరిపాక రూపుడు - కవితాప్రపంచరవి" తిక్కన, యేయట. తిక్కన 'కడిది యశః కాంతివలన వ్యక్తములైన విశేషములతో కవిత్వ తత్త్వ విచారము వీరు విరచించిరట. ఈతత్త్వవిచారములో దేలిన సిద్ధాంతములపై రాద్ధాంతములు వెలువడక పోలేదు. అగుగాక! కట్టమంచి రచయిత యేసమీక్షయైనను నిష్పాక్షికమై నిశితమై యుండుననుట నిర్వివాదము. రాజకీయముగా గూడ రెడ్డిమాటలు సూటిగా, వేడిగా నాటుకొనుచుండును.


జాతీయ కవితాభిమాని యగు రెడ్డియూహలో వేమనకవి కారణ విమర్శనశక్తికి బట్టాభిషేకము చేసిన మహాత్ముడు, ప్రతిభాశాలియునగు మహాకవి. "ప్రకృతి యనగా మనవారి కనేకుల నిఘంటువులలో నుండు ప్రకృతియేగాని, మూలింటికిబయటనున్న ప్రకృతియెట్టిదో తమసొంత కన్నులతోడ జూచిన పాపమున బోరు. అట్టివారికి వేమన యనుసరణీయమైన త్రోవచూపినా డనుటలో నించుకయు గుణాధిక్యస్తుతి లేదు" ఇది కట్టమంచి విమర్శకుని వాజ్మూలము. ఈ రచయిత అర్థశాస్త్రము నాంధ్రీకరించి యాకృతి స్మరణీయ యగు ప్రేయసి కొసగినాడు. దానికొఱకై వ్రాసిన యంకితపద్యములు పదో పండ్రెండో. అన్నియు జక్కనివీ. ఒక్కటిమాత్రము వ్రాసెదను.


కల్లోల మాలికాకరముల వీచుచు

నెలు గెత్తి పిలిచెడు జలధినుండి-