Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లితము చేసి ప్రదర్శింపబడియున్నవి. వీరి శతాధికగ్రంథములలో గల కవితాధారయెల్ల యతిప్రాసములకు దడవుకోకుండ నడచిపోవుచున్నట్లుండును. రసభావదృష్టితో విమర్శించినచో నిలబడుపద్యములు మిక్కిలితక్కువగానుండును. చ్యుతసంస్కారములు దొరలు చుండుటయు గలదు. కాని ధోరణి యెత్తు పల్లములు లేక యొ కే తీరున సాగుట మెచ్చుకో దగిన ముఖ్యవిషయము. బహుగ్రంథ రచనమునందే వీరికి వేడుక కలిగియుండిన కారణమున, శాశ్వతస్థాయిగా నుండగల గ్రంథ మొకటియు వ్రాయలేక పోయినారు. వ్రాసినవానిలో గొన్ని కొంతపేరు సంపాదించుకొన్నవి యున్నవి. A History of Telugu Literature అనుపేర వీ రాంగ్లములో నొక గ్రంథము వెలువరించిరి. దాని రచనలో పి. చెంచయ్య గారు తోడ్పడిరి. అది కొంత పేరుగొన్న కూర్పు. "ఆధునికాంధ్ర కవిజీవితములు" అను పేరుపెట్టి వీ రొకగ్రంథము నచ్చు కొట్టించిరి. అది వీరి ప్రథమ పుత్రిక పరిణయ సందర్భమున సమావేశమై 233 విద్వత్కవులు చేసిన యాశీస్సులు గల కృతి. అందు విశేషమేమనగా వారి వారి సంక్షిప్త చరిత్రములు కూడ జేర్పబడి యున్నవి. ఆకారణమున, ఆపుస్తకము దాచుకో వలసినదిగా దోచును. కొమార్తెల వివాహములు మహావైభవముగా జేసి భుజంగరావుగారు మంచిపేరు కవిలోకములో సంపాదించుకొనిరి. ఒక కవి యిట్లు వ్రాసినాడు.


క. రాజా భుజంగరాట్కవి

భోజు డహా! దేవదుందుభులు మ్రోగించెన్

భూజనముల బూజనముల

భోజనముల దనిపి ప్రథమపుత్రిక పెండ్లిన్.


అభిజ్ఞాన శాకుంతలము, ఉత్తరరామచరితము వీరు మధురముగా నాంద్రీకరించిరి. 'తత్త్వమీమాంస' యనుకృతి పండువయస్సులో