పుట:AndhraRachaitaluVol1.djvu/257

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చిలుకూరి వీరభద్రరావు

1872 - 1939

ఆరువేల నియోగిబ్రాహ్మణులు. అభిజనము: తణుకు తాలూకాలోని ' రేలంగి '. నివాసము: రాజమహేంద్రవరము, కొవ్వూరు. జననము: 17-10-1872. నిర్యాణము: 1939 సం. రచిత కృతులు: రాజమహేంద్రపుర చరిత్రము. ఆంధ్రుల చరిత్రము - జీర్ణకర్ణాట రాజ్యచరిత్రము. తిక్కన సోమయాజి, తిమ్మరుసు మంత్రి - శ్రీనాథకవి - శివాజీ చరిత్ర, కర్ణసామ్రాజ్యము, నవరసిక మనోల్లాసిని, స్వయం సహాయము, వరలక్ష్మీ విలాసము, హిందూసంసారము, హిందూ గృహము, హాస్యతరంగిణి, సుమిత్ర, ఆళియ రామరాజులు, నాయకురాలి దర్పము.

వీరభద్రరావుగారు చరిత్రచతురాననులు. ' ఆంధ్రుల చరిత్ర ' తో వీరికఖండకీర్తి వచ్చినది. ఆంధ్రులప్రాచీనచరిత్రమును బరిశోధించి వెలువరించినవారిలో నీయనయే కనిష్ఠికాధిష్ఠితులు. వీరియనంత పరిశోధనములనుండియే నేటి పలువురు రచయితలు చక్కని విషయములు సంగ్రహించి పత్రికాపాఠకుల కిచ్చుచున్నారు.

వీరభద్రరావుగా రాంధ్రభాషకు బ్రాణములు ధారవోసిరి. ఆంధ్రజాతిపై వీరికవ్యాజమైన యాదరము. వీరు సంఘసంస్కృతి నభిలషించిన సదాశయులు. జాతివికాసము కలిగింప నెంచి దేశోపకారి, విబుధరంజని, ఆంధ్ర కేసరి పత్రికలు ప్రకటించిరి.

పంతులుగారి కలము జంకుకొంకులు లేనిది. వాదోప వాదములలో విలయనాట్యము సలిపినది. కలములో నున్నంత నిరంకుశత నోటిలో లేదందురు. ఎంతయావేగముగా వాదించినను జివరకు నవ్వుకొనుచు మరియొక సంభాషణములోనికి మార్చివైచుటమాత్రము వారియెడ