పుట:AndhraRachaitaluVol1.djvu/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పారనంది రామశాస్త్రి

1853-1930

కాసలనాటి వైదిక బ్రాహ్మణులు. ఆశ్వలాయన సూత్రులు. కాశ్యపస గోత్రులు. తల్లి: రామలక్ష్మమ్మ. తండ్రి: ముఖలింగేశ్వరుడు. జన్మస్థానము: పిండివాడ (పర్లాకిమిడి సంస్థానమునకు జెందినది). జననము: 1853 సం. (పరీధావి శ్రావణ శుక్ల నవము) నిర్యాణము: 6-12-1930 సం. గ్రంథములు: 1. ఆంధ్రశబ్దచింతామణి (ఉద్ద్యోలినీ వ్యాఖ్య) 2. ఆంధ్రమహాభారత విమర్శనము 3. కురుక్షేత్రయుద్ధ కాలనిర్ణయము 4. ముధుకేశ్వరీయము (నాటకము ఆముద్రితము).

శ్రీ రామశాస్త్రిగారు పెద్దయాస్తి కలవారు కాకపోయినను గొప్ప యాస్తికులు. పేరు మోసిన పండితులు. క్రొత్తతీరు లెరిగిన విమర్శకులు. సంస్కృతాంధ్రములలో సరితూకముగల పరిశ్రమ పాటవము గలవారు. తొలుత గావ్యపాఠము గావించి శాస్త్రపఠనముపై మనసు గూరి బొబ్బిలి చేరి శ్రీ సుసర్ల సీతారామశాస్త్రిగారితో దర్కా లంకార వేదాంతము లధ్యయనించిరి. సంస్కృతములో లోతులు తడవిన పాండితి సంపాదించి, పదపడి తెలుగుబాస పొలుపులు గుర్తించినారు.

పర్లాకిమిడి రాజు రామశాస్త్రిగారి సామర్ధ్యము నెరిగి సంస్థానోన్నత విద్యాలయమున నుపాధ్యాయ పదవి యిడి గౌరవించిరి. ఆయుద్యోగము 1853 మొదలు 1911 వరకు చిచ్చిత్తి లెకుండ గొనసాగినది. శ్రీ శాస్త్రిగారు తాత్వికదృష్టిగల కర్మిష్ఠియగుటచే, తన కుమారుడు పట్టభద్రుడై, యుద్యోగియై, పదిరాళ్లు సంపాదించుకొను ప్రయోజకుడై యుండుట జూచి తనపని చాలించుకొనెను.

దేవీ భాగవతమును దెలిగించిన త్రిపురాన తమ్మయదొర వీరిని గౌరవించి ధన్యుడయ్యెను. ఉర్లాము మున్నగు నాస్థానులలో వీరు ధర్మాది శాస్త్రముల పరీక్షల నెగ్గి యుగ్గడింపబడిరి. పండితులతో శాస్త్రార్థ