పుట:AndhraRachaitaluVol1.djvu/141

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యాశ్వాసము పూరించిరి. యతిరాజవిజయమున దమ్మనశాస్త్రిగారు కృతిపతులచే నిట్లు చెప్పించుకొనిరి.

పదునాలుగేడుల బొదలు ప్రాయమునాడె

కడగినాడవుగదా కవితసేయ

బదునన్మిదవయేట నాక్రుచ్చితివిగదా

సకలేశశతక మాశ్చర్యఫణితి

నిరువదైదవయేట విరచించితివిగదా

రావుసత్కులచరిత్ర ప్రబంధ

మెడనెడ వేనవే ల్నుడివినాడవుగదా

యనమపద్యముల నత్యాశులీల

నేడు వేడుక జేయుచున్నాడవస్మ

దనుమతిని నయనోల్లాస మనెడు కృతిని

క్షితిని బరికింప నతిశీఘ్రగతిని బూని

నుకవితను గూర్చునేర్పు నీసొమ్ముగాదె!

అభిన వాంధ్రకవులలో బ్రసిద్ధిభావుకులగు దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు తమ్మన శాస్త్రిగారి తనూజు లని తెలియనివా రుండరు.