పుట:AndhraKavulaCharitamuVol2.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40. దామెర వేంకటపతి


ఈకవి పద్మనాయకకులజుడైన శూద్రుడు; ఈపద్మనాయక కులమువారి నీదేశమునందు వెలమలని వాడుదురు. ఈకవి తాత సంస్థానాధిపతియై వేంకటగిరి సంస్థానాధిపతులైన వెలుగోటివారితో సంబంధబాంధవ్యములను జేసినవాడు. ఈకవి తన మేనత్తయైన వేంకటాంబను వెలుగోటి యాచమనాయనికుమారు డయిన కస్తురిరంగనాయని కిచ్చినట్టును ఆదంపతులకు యాచమనాయడు పుత్రుడైనట్టును చెప్పి యాతనిని తనబహుళాశ్వచరిత్రమునం దిట్లు వర్ణించినాడు.


సీ. ఉత్తరమల్లూరియొద్ద దావలుపాపవిభుని గొట్టిననాటివిజయకలన
   చెంగలుపట్టు వీక్షించి లగ్గలుపట్టి యాక్రమించిననాటివిక్రమంబు
   పాళెముకోటవెల్పల నాజి యతిరాజు జరగజేసిననాటిశౌర్యపటిమ
   తిరుమల జేరి ధాత్రినిమన్నెరాజుల బాఱదోలిననాటిబాహుబలము
   

   మున్నెతోపూర జగ్గరాణ్ముఖుల నొంచి
   మధురదొర జెంజిమన్నీని మద మడంచి
   తిరుచనాపల్లి దొర దోలుతేజము గల
   మేటి వెలుగోటియాచని సాటిగలరె!

కవియొక్క మేనత్తభర్తయైన కస్తురి రంగనాయడు గోలకొండ మహమ్మదీయులను కొండవీడు వినుకొండ ప్రభువులను గెలిచి, 1579 వ సంవత్సరమునందు చంద్రగిరియందున్న విజయనగరపు రాజులపక్షమున యుద్ధముచేసి వారిశత్రుల నోడించెను. కవియొక్క మేనత్తకొడుకయిన యాచనాయడు చెంగల్పట్టుమండలములోని మధురాంతకములో వాసముచేసి విజయనగరాధిపతియైన వేంకటపతిరాయలవలన పెరమాడి సీమను బహుమానమందెను; అంతేకాక యితడు 1602 వ సంవత్సరమునందు శత్రువులతో యుద్ధముచేసి వారి నోడించెను; ఆవఱకు పరులపాలైన వేంకటగిరిని మరల స్వాధీనము చేసికొనెను. కవియు