పుట:AndhraKavulaCharitamuVol2.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శైవవైష్ణవపురాణావళి నానార్థరచనాపటిష్ఠైకరమ్యమతివి

లౌకికవైదికలక్షణచాతుర్యధైర్యప్రభారూడకార్యచణుడ

వాంధ్రభూమీకుచాగ్రహారభ మైన

శ్రీతెనాల్యగ్రహారనిర్నేత వగ్ర

శాఖికాకోకిలమ వీవు సరసకవివి

రమ్యగుణకృష్ణ రామయరామకృష్ణ


క. కౌండిన్యసగోత్రుడ వా

ఖండలగురునిభుడ వఖిలకావ్యరససుధా

మండనకుండలుడవు భూ

మండలవినుతుడవు లక్ష్మమావరతనయా.


క. యశము గలిగించు నీమృదు

విశదోక్తుల బౌండరీకవిభుచరిత జతు

ర్దశభువనవినుతముగ శుభ

వశగతి నాపేర నుడువు వరత త్త్వనిధీ.


ఉ. స్కందపురాణనీరనిధికౌస్తుభమై ప్రభవించుదేవకీ

నందనుసత్కథోద్యమము నవ్యకవిత్వకళాకలాపమున్

కుందనమున్ ఘటించి కడుగ్రొత్తగు సొమ్మొనరించి విష్ణుసే

వం దిలకించునప్పరమవైష్ణవకోటి నలంకరింపుమా.


మ. ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునుం జుట్టిరా

విదితంబైనమహిన్మహాంధ్రకవితావిద్యాబలప్రౌడి నీ

కెదు రేరీ సరసార్థబోధఘటనాహేలాపరిష్కార శా

రద నీరూపము రామకృష్ణకవిచంద్రా సాంద్రకీర్తీశ్వరా!


ఈపద్యములనుబట్టి చూడగా కవి కొంతవఱ కాత్మశ్లాఘాప్రియుడని తోచక మానదు. ఇత డెంతప్రౌడకవియైనను స్వోత్కర్షప్రకట