పుట:Andhra-Bhasharanavamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డలరుఁ దద్విద్య సాదన యనఁగ నెగడు నఱుకు పరుపడి గాయమానంబు విసరు
మొన లనంగను దద్భేదములు చెలంగు నొక టొకటి పెక్కువితములై యొప్పు నభవ.

205


సీ.

సాధనాయుధములు సానకత్తి యనంగ బొందకోల యనంగఁ బొలుపుఁగాంచు
మాసటిపోట్లాటమట్టుకుఁ దగుకత్తి చేకత్తి యనఁగను జెలఁగుచుండు
జింకకొమ్ములు రెండు చేర్చి యల్గు లమర్చి డాఁకేలఁ బూన నొ డ్డనఁగఁ బొడువ
సంగతిగలయది సింగోట యనఁగను దివిదారికొమ్మనాఁ దేజరిల్లు
నొంటిపోట్లాటఁ గోరుచునున్న యట్టి మాసటీలకుఁ గైదువు ల్మట్టుఁ జూచి
యేరుపఱచుట వెలయుఁ గొలారిక మనఁ దద్రణావని పడవనాఁ దగును నభవ.

206


సీ.

మనును జెట్టి యనంగ మల్లాభిధానంబు తద్విద్య సా మనఁ దనరుచుండుఁ
గన్నాతలు పుటము లస్తాలు మండీలు దాళాలు డింకీలు దండెములును
లాగు లనంగను రాజిల్లుఁ దద్భేదనామధేయంబు లెన్నంగఁ గొన్ని
తత్సాధనంబులై తగు గంబము కొణత కటి కన లోడుసంగడము బాల
సంగడము నీలగోతా మనంగఁ గొన్ని దట్టియనఁ గచ్ఛమగును జేతా ళ్లనంగ
మల్లయుద్ధాయుధాఖ్య లై యుల్లసిల్లు ముళ్లనఁ దదగ్రనామము ల్పొల్చు నభవ.

207


సీ.

బిరుదువేసిన జెట్టిపరివార మగునట్టి వా రొప్పుదురు హొంతకారు లనఁగ
గుద్దులాటకు జెట్లఁ గూర్చువానికిఁ చేరు దసువంది యనఁగను దనరుచుండు
నణుకువాఁ డనఁదగు నన్యజాతీయుండు కవణకాఁ డన మీఱు గమనబోధి
మల్లచఱు పనంగ మల్లచఱుపు డన భుజసమాస్ఫాలనం బొప్పుచుండు
దండ యనఁగను ముష్టియుద్ధాదిమగతి మించు నందున మద్దెళసంచు మొదలు
కొన్ని భేదంబులు చెలంగు నన్ని దెలుప గ్రంథవిస్తరభయముచేఁ గాలకంఠ.

208


సీ.

కల్లంబు రాటంబు కత్తి కొక్కిస తొట్టు రూణింపు బరిపోటు రొండివ్రేటు
వింటాళము పణమ్ము పెట్లాగు పాఱమ్ము డొక్కర ముత్తర డొక్కరమ్ము
కన్నాత బాంగణ కందణంబు తిణింగి గొంతుమాఱును జేబ కుమ్మరింపు
కానె నీల్కడ గళకత్తెర జోడింపు నరసింగ ముసిరి బిత్తరము కిల్లి
చాగు సమసీసము తడకాల్ సందుసీస మంజ మెడపట్టు నాఁగఁ జెన్నలరుచుండు
ముప్పదియురెండువిన్నాణములకుఁ బేళ్ళు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

209


సీ.

 వెంబడి బాసట వెంట తో డనుగల మనుఁ గనఁగను సహాయాఖ్య దనరుఁ
దోడ్పా టనంగను దోఁచు సాహాయ్యంబు దందు దడ మనంగఁ దనరు సేన
యుభయసేనాభిధ యొ ప్పిరువా గనఁ బొల్చు సేనాముఖము మొన యనఁగ
వ్యూహంబు వెలయుచునుండు మొగ్గర మన నొడ్డణమం చన నొ డ్డనంగ