పుట:Andhra-Bhasharanavamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బొ ట్టనఁగఁ జు క్కనఁగఁ జుక్కబొ ట్టనంగఁ బొలుచుఁ జాఱిక పత్తిరిబొ ట్టనంగఁ
దద్విశేషాఖ్య ఘుసృణంబు దనరుచుండుఁ గుంకుమ యనంగ బాలశశాంకచూడ.

160


సీ.

చెందిర మనఁగను సిందూరము చెలంగు లక్కయం చనఁగను లాక్ష వెలయు
లారస మెసంగు లత్తుకయం చనఁ గుంకుమపూ వనఁ గుంకుమ మగుఁ
గుసుమపూ వనఁగఁ దగును గురుంభాభిధ జాజికాయన మీఱు జాతిఫలము
జాపత్రి యనఁగను జాతిపత్ర మొప్పు గసగస లన మస్తు గానిపించు
విత్తు లెసఁగును జాఁదన వెలయుఁ జాష మలరు సాంబ్రాణి సామ్రాణి యనఁగఁ బూతి
పునుఁగు తట్టుపునుంగనఁ దనరుఁ బిల్లి గడ్డచట్ట మన బిడాలక మగు శర్వ.

161


సీ.

చను జవాది జవాజి జవ్వాది జవ్వాజి యనఁగ సంకుమదాఖ్య దనరుచుండు
గోరోజన మనంగ గోరోచనాభిధ కపురము కప్రము కప్పురమ్ము
సిరము గంబూర గంబుర గంబురా గంబురమ్మ గంబూర మ్మన మ్మను ఘన
సారము సజ్జరస మ్మన సర్జరసమ్ము చెలంగు గంద మ్మనంగ
గంధ మొప్పు మలాకనాఁగను దనర్చుచుండు శ్రీఖండ మగురునా నొనరు నగరు
గంధచూర్ణంబు చెలఁగు బుక్కా మనంగ గందవొడి యనఁగాను బుక్కాయన భవ.

162


సీ.

యక్షకర్దమసంజ్ఞ యలరుఁ గదంబమ్ము కలపము నాఁగను వెలయు సేస
యనఁగఁ బుష్పాంజలి తనరుఁ దోమాలెనా మాలిక పువుటెత్తు పూలపొట్ల
మనఁగ మాల్యగ్రంధి యగు నెరతన మన నాభోగసంజ్ఞ యై యడరును దల
గడ తలాడ తలాపి తలయంపి యొరుగునా నుపధానసంజ్ఞ యై యొప్పుచుండుఁ
దద్విశేషాభిధానంబు తగును బటువు బిల్లదిం డన శయ్యాఖ్య చెల్లు సెజ్జ
పరపు తలిపము దడిబను పాన్పు మెత్త యనఁ దదాచ్ఛాది యెసఁగు లేపనఁగ శర్వ.

163


సీ.

ఖట్వాఖ్య రాజిల్లుఁ గంకటి యం చనఁ బట్టెమంచం బనఁ బరఁగు మృదుల
ఖట్వ రాజులు నలఖట్వ కుక్కి యనంగ నలరు గోడనఁగ ఖట్వాంగ మెనఁగుఁ
బట్టెయం చనఁదగుఁ దట్టిక కుసి కూచ మనఁ బట్టికాగ్రమై యలరుచుండుఁ
జిత్రాల్పపట్టిక చెలఁగు నవారనఁ గటసంజ్ఞ చా పనఁగాఁ జెలంగుఁ
గందుకము చెండు బంతినాఁగను దనర్చు దివ్వె దిన్వియ దివె దీవె దివియ దీవి
యనఁగ దీపాహ్వయంబుగా నలరుచుండు మాతృభూత జగత్త్రయీమాతృభూత.

164


సీ.

దీవటీ దివ్వటి దివటి పంజనఁగను గరదీపికాఖ్యయై పరఁగుచుండు
జుంజురు దుందురు సురుడు దివ్వెనకోల యనఁ గాష్ఠదీపికాహ్వయము చెలఁగు
నీరాజనాభిద నెగడు నివాళి యారతినాఁగ వత్తినాఁ బ్రబలు వర్తి
ద్విముఖదీపిక గడిదేరు నీలాలినాఁ ద్రిముఖదీపిక పేరు తేజరిల్లుఁ