పుట:Ananthuni-chandamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాగములుగల అక్కర అని అర్థము; అంటే పాదము రెండుసమభాగములు చేయగా రెండుసమభాగములలోను గణములు ఒక్కతీరున ఉంటవని అర్థము.

2, 3, అక్కరల పేళ్లలో ఇంతమట్టుకు వైషమ్యమున్నా జయంతి రామయ్యపంతులు గారు అది కనిపెట్టకపోవడమే కాక '... పాదమున కై దేసి గణములుగల యక్కర గణసంఖ్యచే నైదక్కరలకు మధ్యస్థానమున నుండుటచే మధ్యాక్కర మను పేరును నన్వర్థములుగానున్న” వని వ్రాయుట చాలావింతగా ఉన్నది. మధ్యాక్కరపాదములో ఉన్న గణములు ఆరుగాని, ఆయన చెప్పినట్లు అయిదుకాదు. “మధ్యాక్కర” అని అర్థమిచ్చే కన్నడవు నడువణక్కర అనే పేరు అన్వర్థముగా ఉన్నదని కాబోలు వారు చెప్పదలచి అట్లు వ్రాసినారు.

కన్నడవు అక్కరలకున్ను తెలుగు అక్కరలకున్ను లక్షణములో కొద్దిగా భేదములున్నవి.

1. తెలుగు పద్యములలో సూర్యగణము లుండేచోట కన్నడపద్యములలో బ్రహ్మగణము లుంటవి (అనగా నగణ హగణములేకాక గగ, సగణములు కూడాను). తెలుగులో ఇంద్రగణము లుండేచోట కన్నడములో విష్ణుగణము లుంటవి (అనగా నల, నగ, సల, భ, ర, తలేకాక మగణము, సగణగురువు కూడాను). తెలుగులో చంద్రగణము లుండేచోట కన్నడములో రుద్రగణము లుంటవి(అనఁగా నగగ, నహ, సలల, భల, భగ, మల, సవ, సహ, తల, రల, నవ, నలల, రగ, తగలేకాక మగ, సగగములు కూడాను).