ఈ పుట అచ్చుదిద్దబడ్డది
జరిగిన కార్యక్రమాలు, కళాకారుల సేవలు ఒక ప్రాధాన్యతను సంతరించు కున్నాయి.
రమణగారు తన కన్న తల్లిని, తన కుమార్తెను ఎంత అపురూపంగా చూసుకున్నారో, ఆ విధంగానే మాతృసంస్థ అయిన రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం విషయంలో ఎప్పుడు ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరించి సంఘంలో తనకున్న సంబంధాన్ని చాటిచెప్పిన "మనీషి".
26వ వార్షికోత్సవం రోజు అది. వేదిక ఎదురుగావున్న కుర్చీలను రమణ శుభ్రం చేస్తుండగా చూశాను, ఎందుకు రమణగారు మీరు తుడవడమేంటి అని అడగ్గా ఆయన వెంటనే ఇది నా పని, నా సంస్థపని, నా స్వంతపని అని చెప్పిన సమాధానానికి నేను ఎంతగానో ఆనందపడ్డాను. ఆయన చేసే వృత్తి ఏమిటి, ఆయనకు సంఘంలో వున్న పలుకుబడి ఏంటి, అటువంటి వ్యక్తి ఈ కుర్చీలు తుడవడమేమిటి అని కృతజ్ఞతా పూర్వకంగా ఆయన వంక చూడటం నా పని అయింది.