అయితే ఇప్పటికే అమెరికాను అధిగమించి ప్రపంచార్థిక శక్తిగా ఎదిగిన చైనాకు ఇలాంటి వైరస్ ద్వారా అల్లకల్లోలం సృష్టించి, ప్రత్యర్థులను ఓడించవలసిన ఆగత్యముందా? చైనాను దెబ్బతీసేందుకు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అమెరికాకే అలాంటి కల్లోలాల్ని సృష్టించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రపంచంలోనే ప్రబల ఆర్థిక శక్తిగా ఉన్న చైనాకు వ్యతిరేకంగా అమెరికా దాని అనుకూల దేశాలు తీవ్ర ప్రచారం చేస్తున్నాయి. ఈ మహమ్మారి విలయం సమసిపోయాక, అందుకు చైనాను దోషిగా నిలబెట్టి, వాణిజ్య లావాదేవీల్లో ఆ దేశానికి చెల్లించవలసిన డబ్బును ఎగ్గాట్టే వ్యూహంలో భాగంగా అమెరికా తదితర దేశాలు ఇలాంటి ప్రచారానికి ఒడిగడుతున్నట్లు కొందరు భావిస్తున్నారు. కరోనా వైరస్‌కు మూలం చైనా లేదా వూహాన్ లేదా అక్కడి సముద్ర ఆహారోత్పత్తుల మార్కెట్లు కాదని, అది అమెరికా మిలటరీ ఫోర్డ్ డెట్రిక్‌లో నిర్వహిస్తున్న జీవాయుధాల ప్రయోగశాలకు చెందినదని చైనా వైరాలజిస్టులు ద్రువీకరిన్తున్నారు. ప్రమాదవశాత్తు ఫోర్డ్ డౌట్రిక్ నుంచి విడుదలవుతున్న రోగ కల్లోలాల వల్ల ఈ ప్రయోగశాలను అమెరికాకు “సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్” (సీడీసీ) సంస్థ 2019 జూలైలో మూయించి వేసింది. ఆ తర్వాత అక్టోబర్ లో ఈవెంట్ - 201 పేరుతో అతి పెద్ద 'కంప్యూటర్ సిములేషన్ ఎక్స్‌ర్‌సైజ్ (కంప్యూటర్‌లో కృత్రిమ వాతావరణం కల్చనతో చేసిన ప్రయోగం) జాన్ హాష్మిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ వద్ద ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్యూఈఎఫ్), బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. అయితే భౌగోళిక ఆర్థిక రాజకీయ యవనికలో చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు అమెరికా పన్నాగాల్లో కొత్త రకం కృత్రిమ కరోనా మహమ్మారి ఒకటి అని చైనా వాదిస్తోంది. 2019 అక్టోబర్‌లో వూహాలో జరిగిన ప్రపంచ మిలటరీ గేమ్స్ సందర్భంగా, అందులో పాల్గొనడానికి వచ్చిన 200 మంది అమెరికా సైనికుల ద్వారా ఈ వైరస్‌ను సీఐఏ ప్రవేశపెట్టించిందన్న ఆరోపణలను తోసివేయలేం. డబ్ఞ్యూఈఎఫ్, బిల్ గేట్బ్‌కు చెందిన జీఏవీఐ (వాక్సినేషన్, ఫార్మాస్యూటికల్స్‌ను ప్రోత్సహించే సంస్థ, రాక్ ఫెల్లర్, రాల్ట్స్ వగైరా కార్పొరేట్ సంస్థలు “ఎజెండా ఐడీ 2020 అనే కార్యక్రమం ద్వారా - ఏకరీతి ప్రపంచాన్ని (ఒన్ వరల్డ్ ఆర్జర్)ను తీసుకురావాలనే పథకాన్ని రచించాయి. ఇందుకోసం అవసరమైన డేటా చిప్‌ను మొత్తం మానవాళి శరీరాల్లోకి ప్రవేశపెట్టాలని రహస్యంగా తీర్మానించుకున్నాయని తెలుస్తోంది. అందుకోసం వరునగా వైరస్ మహమ్మారులను సృష్టించి, వాక్సినేషన్ కార్యక్రమం ఐడీ 2020 పధకాన్ని విజయవంతం చేయాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయంగా పలు కథనాలు వెలువడ్డాయి.
బౌగోళిక రాజకీయ అంశాలన్నీ సహకారణాలు లేదా పరిస్థితులు (ప్రత్యయాలు) గా నిలుస్తాయి. ఏ కార్యానికైనా ఒకే కారణమంటూ ఉండదు. హేతుప్రత్యయాలు కలగలసిన “పరస్పరాధారిత ఆవిర్భావం” (dependent origination) గానే కరోనా వంటి మహమ్మారులు ఉనికిలోకి వస్తున్నాయని గ్రహించాలి. ఈ రోగ కారక క్రిములు చేస్తున్న మారణహోమానికి తాత్కాలిక పరిష్మారాలుగా మందులు, వాక్సిన్‌ల వంటివి కనుగొన్నప్పటికీ, దీర్జకాలిక, శాశ్వత పరిష్కారం కోసం ప్రపంచ ఆభివృద్ధి నమూనాను సమూలంగా పునర్నిర్వచించుకోక తప్పదు.
“మనుషులు ప్రకృతి నుంచి జీవిస్తారు అంటే ప్రకృతే మన శరీరమవుతుంది. మరణించకుండా ఉండాలంటే, ప్రక్ఫతితో మనం నిరంతరాయంగా సంభాషించాల్సి ఉంటుంది” ఒక పాశ్చాత్య తత్త్వవేత్త వ్యాఖ్యానాన్ని మనం తప్పక గుర్తుంచుకోవాలి.