Jump to content

పుట:Ammanudi April-July 2020.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బొధనలను గ్రంథస్తం చేసి, ఆయన విగ్రహారాథన చేస్తూ అనేక కాల్పనిక కథలను, భావనలను ప్రచారం చేస్తున్నట్లుగానే అంబేద్కర్‌ విషయంలోనూ అదే జరిగింది. అంబేద్మర్‌ను దేవుడుగాను, 'బుద్దుడు-ఆయన ధర్మం ' అనే ఆయన పుస్తకాన్ని పవిత్ర మత గ్రంథంగాను నవయాన బౌద్దం పేరుతో ఆయన అనుయాయులు మార్చివేసారు. ఈ సందర్భంగా ఆ గ్రంథానికి అంబేద్మర్‌ రాసిన ముందుమాటలోని కొంత భాగాన్ని పాఠకుల అవగాహన కోసం ఇక్కడ ఇస్తున్నాను.

ఉపోద్దాతం

భారత ప్రజల్లోని కొన్ని సెక్షన్లకు బుద్దిజంలో ఆస్తక్తి బాగా పెరుగుతున్న సూచనలు కనపడుతున్నాయి. దాంతోపాటు బుద్ధుని జీవితం, ఆయన బోధనలు గురించి నిర్దిష్టమైన నిర్దుష్టమైన వివరణ కావాలన్న డిమాండ్‌ సమాజంలో పెరుగుతోంది.

బుద్ధుని జీవితం ఆయన బోధనలను ఒక నిర్దుష్టము, సమగ్రము అయినదిగా తీర్చిదిద్దే రీతిలో బుద్ధిస్టు కానివారెవరైనా వివరించడం చాలా కష్టం. నికాయ లపై అధార వడడం, బుద్దుని పొందికైన జీవిత చరిత్రను వివరించడం చాలా కష్టతరమైన విషయం. ఆయన బోధనల్లో కొన్ని భాగాలను వివరించడం అంతకంటే మరింత కష్టతరమైన విషయమవుతుంది. అలా చెప్పడం నిజంగా అతిశయోక్తి కాదనుకుంటే ప్రపంచంలోని మత వ్యవస్థావకులందరిలోకెల్లా బుద్ధిజం వ్యవస్థావకుని జీవితం బోధనల గురించి వివరణ చికాకు పుట్టించేదిగానొ భంగపరిచే సమస్యగానో ఉంది. ఈ సమస్యల్ని పరిష్కరించి, బుద్ధిజాన్ని అర్ధం చేనుకునే మార్గాన్ని స్పష్టంగా రూపొందించుకోవడమనేది అవసరమా... కాదా? బౌద్ధీయులు ఈ సమస్యలపై కనీసమాత్రమైన సాధారణ చర్చను లేవనెత్తవలసి ఉంది. ఈ సమస్యలపై తగినంత సమాచారం అందించి దాన్ని వెలుగులోకి తీనుకురావలనిన సమయం ఆసన్నం కాలేదా?

ఈ సమస్యలపై చర్చను లేవనెత్తాలనే ఉద్దేశంతో నేను కొన్నిటిని ఇక్కడ ప్రతిపాదిస్తున్నాను.

మొదటి సమస్య బుద్దుని జీవితంలో కీలక ఘట్టమైన పరివ్రాజకత్వానికి సంబంధించినది. బుద్దుడు ఎందుకు పరివ్రాజాన్ని స్వీకరించాడు? ఒక శవాన్ని ఒక లోగిని ఒక మునలివాణ్నీ చూసినందువల్ల ఆయన పరివ్రాజాన్ని చేపట్టారని సాంప్రదాయక సమాధానం ఆ సమాధానం అసంబద్ధమైనదిగా మనకు కనపడుతుంది. బుద్దుడు తన 29 ఏళ్ళ వయసులో పరివ్రాజాన్ని స్వీకరించారు. ఈ మూడింటిని చూసినందువల్లనే ఆయన పరివ్రాజకుడిగా మారాడనుకుంటే, అంతకు ముందు వీటిని ఎంధుకు చూడలేదు? ఇవి వందలాదిగా సంభవిన్తున్న సాధారణ సంఘటనలు మాత్రమే, అంతకుముందు ఇలాంటివాటిని చూడటంలో బుద్ధుడు విఫలం కాకపోయి ఉండొచ్చు... వాటిని ఆయన మొట్టమొదటినారిగా చూశాడని చెప్తున్న సంప్రదాయ వివరణను ఆమోదించడం అసాధ్యం. ఆ వివరణ ఆమోదయోగ్యం కాదు, అందులో హేతువే లేదు. అయితే ఇది ఆ ప్రశ్నకు సమాధానం కానట్లయితే నిజమైన సమాధానమేది?

నాలుగు ఆర్యసత్యాలు రెండవ సమస్యను సృష్టించాయి. అవి బుద్ధుడి అసలైన బోధనలలో భాగమేనా? బౌద్ధం సమస్యలకు మూలం ఈ సూత్రంలోనే ఉంది. జీవితం దుఖం, మరణం దుఃఖం, పునర్జన్మ దుఃఖం అయినట్లయితే, అప్పుడు ప్రతిదీ అంతమైపోతుంది. మతం గానీ తత్వశాస్త్రం గానీ ప్రపంచంలో సంతోషాన్ని సాధించేందుకు మనిషికి సహయం చేయాలి. దుఃఖం నుంచి తప్పించుకునే పరిస్థితే లేకపోతే, పుట్టుకతోనే ఎప్పుడూ దుఃఖమున్నప్పుడు, అందులోంచి మనిషిని బయటపడేసేందుకు ఈ మతం ఏంచేస్తుంది; బుద్ధుడు ఏం చేయగలడు? బౌద్దేతరులు బౌద్ధ బోధనలను అమోదించేందుకు నాలుగు అర్యసత్యాలనేది ఒక మహా అడ్డంకిగా నిలిచింది. నాలుగు ఆర్యసత్యాలు మనిషికి ఆశ (కొరిక)ను తిరస్మరించాయి.. నాలుగు ఆర్యసత్యాలు బుద్ధుటి బోధనలను నిరాశావాద సువార్తగా తయారుచేశాయి. అయితే అసలు బోధనలో అవి ఖాగమేనా లేక అ తర్వాత కాలంలో భిక్షువులు వాటిని ప్రక్షిప్తం చేశారా ?

మూడవ సమస్య- అత్మ, కర్మ, పునర్జన్మ సిద్దాంతాలకు సంబంధించినది. బుద్ధుడు ఆత్మ ఉనికిని తిరస్కరించాడు. అయితే కర్మ, పునర్జన్మ సిద్దాంతాన్ని ఆయన ద్రువీకరించాడని అంటుంటారు. దాంతో వెంటనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఆత్మ లేనట్లయితే, పునర్ధన్మ ఎలా ఉంటుంది? ఇవి వ్యర్థ ప్రశ్నలు. బుద్ధుడు ఏ అర్ధంలో కర్మ ఫునర్జన్మ అనే పదాలు వాడాడు? బ్రాహ్మణులు వినియోగించిన అర్ధంలోనే వాటిని వినియోగించాడా? కనుక ఆత్మను తిరస్కరించడం, కర్మ పునర్జన్మలను ద్రువీకరించడం మద్య భయంకరమైన వైరుధ్యమేమీ లేదా? ఈ వైరుధ్యాన్ని పరిష్కరించాల్సిన అవనరం ఉంది.

నాల్లవ సమస్య భిక్కులకు సంబంధించినది. భిక్కును సృష్టించడంలో బుద్ధునికి ఉన్న లక్ష్య మేమిటి? ఒక సంపూర్ణమైన మానవుడిని సృష్టించడమే లక్ష్యమా? లేక ప్రజలకు సేవచేయడంలోను, వారికి మిత్రుడుగా, మార్దదర్భిగా తత్త్వవేత్తగా వ్యవహరిస్తూ తన జీవితాన్ని అంకితం చేసే సామాజిక సేవకుడ్నీ సృష్టించడమే అయన లక్ష్యమా? చాలా అసలైన ప్రశ్న ఇది. బుద్ధిజం భవిష్యత్తు దానిపైనే అధారపడి ఉంటుంది.

భిక్షు సంపూర్ణ మానవుడైనట్లైతే... బుద్ధిజం ప్రచారానికి అతను పనికిరాడు, ఎందుకంటే అతను సంపూర్ణ మానవుడై నవ్చటికీ స్వార్ధపరుడు. మరొకవైవు, అతను సామాజిక సేవకుడు అయినట్లయితే అతను బుద్ధిజం ఆకాంక్షను నెరవేర్చవచ్చు. సిద్ధాంతపరమైన నిర్దుష్ట అవనరాలను తీర్పడం కోసం కాకుండా, బుద్ధిజం భావి ప్రయోజనాల కొసం ఆ ప్రశ్నను నిర్ణయించాలి... (అందులోని చివరి పేరా మహాబోధీ సొనైటీ జర్నల్‌ గురించి...

మానవాళి విముక్తి మార్గం

బౌద్ధంలో అంబేద్కర్‌కు నచ్చిన అంశాలను 'బుద్దుడు, అయన ధర్మం ' అనే గ్రంథం మన ముందుంచుతుంది. 1. నమ్మకం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా హేతువు గురించి బౌద్దం ప్రధానంగా ప్రస్తావిస్తుంది. కాలామసుత్త వంటి ముఖ్యమైన త్రిపిటకంలో దాన్ని గుర్తించవచ్చు. 2. దాని హేతువాద దృక్పథం కారణంగా ప్రపంచంలో వివిధ మతాలు ఆమోదింఛిన దేవుడు, ఆత్మ వంటి భావనలను, మూఢవిశ్వాసాలను బౌద్దం తిరస్కరించింది. ౩. అస్సలాయనసుత్త, వాసెత్తసుత్త వంటి అనేక సుత్తాల ఆధారంగా బౌద్ధం కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తుంది. శీలం, మైత్రి, కరుణ, ముదిత, ఉపేఖ (బ్రహ్మ విహారాలు)తో కూడిన నైతికత అనేది మనిషి మంచి జీవితపు పరమార్థంగా బౌద్ధం గుర్తిస్తుంది. మనిషి, మానవత్వం కేంద్రంగా నైతికతను బోధిస్తుంది. దేవుడు, ఆత్మలకు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి జూలై-2020

24