పుట:Ammanudi-May-2019.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆవెదన

రావి కొండలరావు 98480 71175

ఓ తెలుగూ.....నీ వెక్కడ?

ఉన్న తెలుగు మాటల్ని ఉపయోగించకుండా వదిలేసి, అవసరంలేని ఇంగ్లీషు పదాలకి తెలుగు ఆలోచిస్తూ కాలయాపన చేస్తున్నాం తెలుగువాళ్ళం! స్వచ్చమైన తెలుగు పదాలు ఆలస్యం, కాయగూరలు, సేపు, నూనె, అలాగే, నిమిషం, క్షణం - వంటి మన మాటల్ని వదిలేసి, లేటు, వేజిటబుల్స్‌, టైము, ఆయిలు, ఓకే, మినిట్‌ - అని ఆంగ్ల పదాలు వాడుతున్నాం. ఇవాళ ఏ ఒక్కరూ 'ఆలస్యం” అనడం లేదు. చదువుకోని వాళ్ళు కూడా లేటయింది, లేటుగా వస్తాను అంటున్నారు... పెన్సిల్‌ కీ రబ్బర్‌కీ మొబైల్‌ ఫోన్‌కీ, పెన్‌కీ, బాల్‌పాయింట్‌కీ తెలుగేమిటా అని తలలు పగల గొట్టుకుంటున్నాం. ఒక్క విషయం గమనించాలి - తెలుగుభాష పుట్టినప్పుడు కంప్యూటర్‌, టెలిఫోన్‌, టెలివిజన్‌ పుట్టలేదు. ఇలాంటివీ ఇంకా ఎన్నో పుట్టాయి. అవి వాటి పేర్లు. వాటికి తెలుగులో ఏం పెట్టాలా అని ఆలోచించడం వ్యర్థ ప్రయాస... వార్తలు రాసేవాళ్ళూ యథాతధంగా అనువదించి రాసేస్తున్నారు. ఇంటర్‌నెట్‌కి, యధాతధ అనువాదం - అంతర్జాలం. ఇంటర్‌ అటే, అంతర్‌, నెట్‌ అంటే వల. అంటే జాలం. ఎవరు వాడతారు ఈ మాటలు? 'నెట్ ' అనే అంటారు. మొబైల్‌ ఫోన్‌కి చరవాణి, సంచారవాణి! “మీ దగ్గర సంచారవాణి వుందా? అని ఎవరైనా అడుగుతారా? ఇంగ్లీషులో లాటిన్‌, గ్రీక్‌ భాషల పదాలు కలిశాయి. సంపన్నమైంది. తెలుగులోనూ ఇంగిలీషు, ఉర్జూ, సంస్కృత పదాలు ఎన్నో కలిసాయి. రోడ్డు అనే ఇంగ్లీషు మాట, అసలు...ఉర్జూ పదాలూ తెలుగైపోయి కూచున్నాయి. పలుభాషలు కలిస్తే భాష విస్తృతమవుతుంది. ప్రపంచ భాషలన్నీ అంతే! తెలుగు భాష రానురాను తగ్గిపోతున్నదని చెప్పడానికి చాలా కారణాలు చెప్పొచ్చు. తెలుగు జాతీయాలు, సామెతలూ ఎందుకు చెప్పుకోడం?

ఈ మధ్య ఒక పత్రిక - “మేక్‌ హే వైల్‌ ది సన్‌ పైన్స్‌” అన్న దానికి తెలుగు అనువాదం చేసింది. “ఎండ వుండగానే, గడ్డి ఎండ బెట్టాలి” అని. దీనికి ప్రత్యామ్నాయం లేదా? మన జాతీయం - “దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి " అన్నది కదా? ఎందుకు వాడరు?

వార్తలు ఇంగ్లీషులో వస్తాయి. వాటినీ తెలుగు చేసి రాస్తారు పత్రికలవాళ్లు. “వర్క్‌ ఈజ్‌ బీయింగ్‌ డన్‌ ఆన్‌ వార్‌ ఫూటింగ్‌” అని ఇంగ్లీషులో వుంటే “యుద్ద 'ప్రాతిపదినక పనులు జరుగుతున్నాయి” అన్నది తెలుగు. “అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి” అని రాస్తే తెలుగు కాదా? “ఏక రూప వస్త్రాలు” అన్నమాట విన్నారా? - అంటే యూనిఫార్మ్‌ కి తెలుగు!

“కష్టమర్‌ కేర్‌ కి వినియోగదారుల రక్ష అసలు ఈ యధాతథ అనువాదం నూరేళ్ల ముందు నుంచీ వుంది. హైస్కూలు కి తెలుగు “ఉన్నత పాఠశాల” హై అంటే ఎత్తయినది - అంటే ఉన్నతమైనది. కొండ మీద వుందా పాఠశాల)... ఎలిమెంటరీ స్మూల్‌ని ప్రాథమిక పాఠశాల అన్నారు. బాగుంది. హైస్కూలుని “మాధ్యమిక పాఠశాల అనవచ్చుగా. ఇంగ్లీషువాళ్ళు లెక్కకిరాని సొమ్ముని బ్లాక్‌ మనీ అంటారు. మనం దొంగ సొమ్ము అనవచ్చు. పత్రికలవాళ్ళు “నల్లధనం? అని ఎందుకు రాస్తారో అర్థం కాదు. యథాతథ అనువావము ముప్పు! మొన్న ఒకాయన లాప్‌టాప్‌కి తెలుగు ఆలోచిస్తున్నాడు! ఎంత ఆలోచించి ఏ పేరు పెట్టినా లాప్‌టాప్‌ అనే అంటాం. దాని పేరు అదీ! కంప్యూటర్‌ ఛిప్‌, బ్రాస్‌, యాప్‌ - ఈ పదాలకి తెలుగు ఆలోచించకండి. ఏ భాషలో అయినా వాటి పేరు అదే.

ఎన్‌.టి.ఆర్‌. ముఖ్యమంత్రి అయాక, తెలుగు మాటలు పెట్టాలని, 'పబ్లిక్‌ టెలిఫోన్‌ొకి “ప్రజా దూర్వాణొ అని రాసి బోర్జు పెట్టారు. ఒక గ్రామీణుడు “దుర్వాణి అంటే ఏమిటంటడీ?” అని అడిగాడు. “టెలిఫోన్‌” అన్నాడు పక్మ్కాయన. “అదా! ఆమాట చెప్పొచ్చు కదండీ” అని నవ్వాడు గ్రామీణుడు.

ఒక పత్రిక - ఎవరో చనిపోతే, “చనిపోయినట్టుగా, సందేశం వచ్చింది” అని రాసింది. ఇంగ్లీషులో మెసేజ్‌ అని వుంది. అంటే సందేశం కదా. “చనిపోయినట్టుగా వార్త వచ్చింది” అని రాస్తే ఎంత బాగుండేది! సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ కి “'వృత్తాధికారి తెలుగు! బాగుంది కదూ!

మీరు రైలు స్టేషన్‌లో గమనించారో లేదో - కొన్ని పెట్టెల మీద అన్‌ రిజర్వుడ్‌ - అని ఉంటుంది. దానికి తెలుగు రాసి వుంటుంది - ఏమిటో తెలుసా? - “అనా రక్షితము”. అది రైల్వే వారి తెలుగు!

విమానాశయంలో - ఎరైవల్స్‌, డిపార్వ్యూర్‌ కి ఆగమనము, నిష్రమణము అని తెలుగులో ఉంటాయి. ఏమిటో! రాకడ, పోకడ - అనొచ్చుగా చక్కగా తెలుగుమాటలు!

దారుణమైన అనువాదాలకి ఇంకో మచ్చుతునక. ఒకడు నేరస్టుడు. అతన్ని పట్టి ఇస్తే 5 లక్షలు ఇస్తామని పోలీసు ప్రకటన. అది ఆంగ్లంలో “హి కారీస్‌ 5 లాక్స్‌ ఆన్‌ హిజ్‌ హెడ్‌” అని వుంటే ఒక పత్రిక చేసిన అనువాదం - “అతనీ తల మీద 5 లక్షలున్నాయి!!”

'ప్రెస్ మీట్ ' “సిఎమ్‌ కాన్వాయ్‌ 'కాటరింగ్‌ బాగుందని మెచ్చుకున్నారు మంత్రి” “మంత్రుల ఉపాన్యాసాలకి నిర్మించిన ప్లాట్‌ఫారం కూలిపోయింది” “ముఖ్య అతిధి సభకి అరగంట లేటుగా వచ్చారు” - ఇలా ఇంగ్లీషు పదాలతోనే తెలుగు పత్రికలు వార్తలు

40

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019