పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

అమెరికా సంయుక్త రాష్ట్రములు


కూలి పుచ్చుకొని పనిచేసియుందురు. వీరి జీవనాధారమునకు బానిసలు పోటీగా నుండిరి. గాని వీరికిగూడ నల్లవాడగు నీగ్రోపుట్టుకవలన తక్కువవాడనియు బానిసత్వము వారి స్వభావస్థితియనియు నమ్మికయండెను. తమకు కొంచెము సైతివర్పడినచో ఒకరిద్దరు సల్లవారిని బానిసలుగకొని పనిచేయించుటకు వీరికి ఎట్టి అభ్యంతరము లేకుండెను. దక్షిణరాష్ట్ర ములలోని శాసనసభలలో స్వభావముగా గొప్ప భూకామందులకే పలుకుబడియుండి బానిసవ్యాపారమున కనుకూలమగు చట్టములను చేయుచు దావిపక్షమున ఆందోళనచేయు చుండిరి. ఉత్తరమున బానిస వృత్తికి వ్యతిరేకముగ ఆందోళనము దృఢపడిన కొలదియు క్రమముగా దక్షిణమునగూడ తెల్లవారిలో సామాన్యజనులలోను మతగురువులలోను కొందరికి బానిసత్వము ఈశ్వరునికి వ్యతిరేకమను అభిప్రాయములు కలిగి అట్టివారు బానిసలు తప్పించుకొని పోవుటకై సహాయ పడుచుండిరి



దక్షిణ రాష్ట్రములలో చేరిన వర్జీనియా రాష్ట్ర నివాసియగు జాన్ బ్రౌను అను తెల్లవాడు మిగులయోగ్యుడు.దైవభక్తి గలవాడు. బానిసలను యజమానులు పెట్టుబాధలు చూడ లేక చిన్న తనమునుండియు బానిసత్వపు నందత్యంత మగు అసహ్యమును కలిగి యుండెను. బానిసత్వమును రూపుమాపపలెపను కక్షిలోచేరెను. చాలమంది బానిసలు తప్పించుకొని పోవుటకై సహాయము చేయుచుండెను. బానిసలలో స్వేచ్చను పొందుటకై ఆత్మవిశ్వాసమును స్వయం కృషిని పురిగొలిపెను. 1850 వ సంవత్సంమున ఆయనయును