పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ అధ్యాయము

113


సుపోద్ఘాతముతో ప్రతిరాష్ట్రమ్మును తమకనుకూలమగు స్వాతంత్ర రాజ్యాంగ విధానమును ' తయారు చేసుకొనవలసినదని దేశీయ మహాజనసభ తీర్మానించెను. జూన్ 7వ తేదీన "సం యుక్త రాష్ట్రములు స్వతం,తమును ' పొందినవి. 'గావున విదేశములలో నొడంబడికలు చేసుకొనుటకును - సంయుక్త రాజ్యాంగ విధానమును తయారుచేయుటకును” దేశీయమహాసభ వారు మరియొక తీర్శానమును కూడ చేసిరి. వీటి నమలులో పెట్టుటకు నంఘములను నియమించిరి.

{కనడాలో ఆమెరికనులు
ఓడిపోవుట}

జూన్ 28వ తేదీన చార్లెసుటనులో జరిగిన యుద్ధము సందు ఆంగ్లేయ సైనికులలో రెండువందల అయిదుగురును, అమెరికనులు ముప్పది యేడుగురును హతులైరి, ఇదికూడ అమెరికను పక్షముసకు కొంత ప్రోత్సాహమును కలుగచేసెను, కాని కనడాలో నమెరికనులకు గొప్ప పరాభవము కలిగెను. మాంగు మరి సేనాని చనిపోయినతరువాత కొద్ది సైన్యము , ఆర్నల్డు సేనాని క్విబికు వద్ద నేయుండి ఇంకకొంత సైశ్యముని తెప్పించు కొనెను. కాని వీరును ఆంగ్లేయులముందర చాలలేదు. ద్రవ్య ముగాని సొమగ్రుగాని అమెరికనులకు తగినంత లేకుండెను.మొదట వీరియందు సానుభూతిని చూపిన కెనడా ప్రజలు వీరికి వ్యతిరేకు లైరి. వాషింగ్టను కూడ మూడు వేలసైనికులను వీరికి సహాయముగా పంపెను. కాని అంతము వ్యర్ధమయ్యే ను. అమెరికను సెన్యములలో స్పోటకము వ్యాపించెను. ముట్టడిని వదలి మరలి రాసాగిరి. ఆంగ్లేయులు 'వెంటటనంటి తరిమి