పుట:Aliya Rama Rayalu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయముగనుక 'బొమ్మ' శబ్దము 'హొమ్మ' గావచ్చును. అట్లగుటచే వీరుడైన బొమ్మరాజును వీరహొమ్మాళిరాయ డని కవి ప్రశంసించుట వింతవిషయము గాదు. కనుక పైబొమ్మరాజుసంతతివా డయినమఱియొక బొమ్మరాజు హొయిసలయాదవులను పదుమూడవ శతాబ్ద్యంతమున కళ్యాణనగరము నుండి పాఱద్రోలి స్వతంత్రుడై పరిపాలనము చేసి యుండును. అతడే యీవంశమునకు మూలపురుషు డయినవీరహొమ్మాళిరాయనిగా గ్రహింపవచ్చును. ఈవీరహొమ్మాళిరాయడు వైష్ణవమత సంప్రదాయాచారములుగలవా డనియు, దేవబ్రాహ్మణభక్తి గలవా డనియు, మాయాపురం బనునామాంతరముగలిగి యుండిన గంగాపురమున 'చెన్నకేశవస్వామిని' ప్రతిష్ఠాపించె ననియును, వీరనారాయణదేవచరణాంభోరుహా రాధనానుసంప్రాపితసకలసామ్రాజ్యవిశేషభోగంబులును, పరముభాగవత సఖిత్వంబును, గల్గి పెద్దకాలము ధాత్రి బరిపాలించు చుండె ననియు నరపతివిజయమునందు గవి వర్ణించి యున్నాడు.

తాతపిన్నమరాజు - కొటిగంటిరాఘవరాజు

ఈవీరహొమ్మాళిరాయనిపుత్త్రుడు తాతపిన్నమరాజని నరపతివిజయమునందు మాత్రమెగాక 'ద్విపదబాలభాగవతము' పీఠికలో నారవీటివంశమును వర్ణించుఘట్టమున దోనూరి కోనేరునాథు డనుకవి:-