పుట:Aliya Rama Rayalu.pdf/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చేత సక్రమముగా వెనుదీయ బ్రారంభించె నట. ఒకనాటి రాత్రి అసాదుఖా నొకచోట విశ్రమించినా డట! అతడు పాఱిపోకుండ జూచుటకుగాను వేంకటాద్రికూడ 8 మైళ్లదూరములో దండువిడిసి విశ్రాంతిగొనుచుండె నట. ఆమఱునాడు సూర్యోదయముకాకపూర్వమే అసాదుఖాను ప్రశస్తమైన నాలుగువేల యాశ్వికసైన్యముతో వచ్చిపైబడి యాశ్చర్యము గొలిపె నట. ఆత్మవిశ్వాస మెక్కువగా గలవాడగుటచేత వేంకటాద్రి యేమరియుండె నట! వారుగన్నెత్తి చూచుసరికి తురకరౌతులు హిందూగుడారముల నడుమనుండిరట! వేంకటాద్రి కెంతమాత్రము తప్పించుకొన సావకాశము లేక తనధనాగారమును, కుటుంబమును, ఏనుగులు మొదలుగా గల వాహనాదికములను వారికి విడిచిపెట్టి పాఱిపోయెనట. తెల్లవారి సూర్యోదయమైన తోడనే వేంకటాద్రి చెల్లాచెదరై పోయినసైన్యములను నొక్కచోటికి మరలచేర్చుకొని యుద్ధముచేయుటకు సంసిద్ధుడై యున్నవానిపగిది నటించుచు బ్రయత్నించినను, తనకుటుంబమునకు నేమివిపత్తు కలుగునో యన్నభయముచేత యుద్ధముచేయుటకు నిష్టపడక కొన్నిమైళ్ల దూరముగా వెనుకకు బోయి యచట నివసించి తనదురవస్థను దెలుపుచు దనసోదరుడైన రామరాయలకు గొంతసైన్యము బంపుమని వర్తమానముచేసె నట. అంతరామరాయ లతడు కోరినప్రకారము ధనమును సైన్యములను బంపి యుద్ధముచేయవలసినదని బహిరంగముగా నాజ్ఞాపించుచు రహస్యముగా