పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోగూడదు. ఈ స్థితి దేవుడు దయచేసిన భాగ్యంగాని మన ప్రయత్నం వల్ల సాధించింది కాదు. కనుక ఆ ప్రభువుకి కృతజ్ఞత తేలియజేయాలి. విచారానుభూతి యెప్పడైనా వచ్చి వేధించవచ్చు. కనుక జాగ్రత్తగా వుండాలి. ఇంకా, అనందానుభూతిలో వున్నప్పడు పూర్వంచేసికొన్న నిర్ణయాలను మార్చుకోగూడదు. క్రొత్త నిర్ణయాలను చేపట్టకూడదు. ఈ దశ దాటిపోయిన తర్వాత వాటిని పాటించడం కష్టమౌతుంది. ఆనందానుభూతి దేవుని నుండి వస్తే యేచిక్కు లేదు. పిశాచం కూడ మనలను మొసగించడానికి ఈయానుభూతిని కలిగిస్తుంది. కనుక సాధకుడు ఇదియెక్కడి నుండి వచ్చిందో గ్రహించగలిగి వుండాలి. ఈయనుభూతి రెండు విధాలుగా రావచ్చు. බීබෲරඪයි పూర్వకారణం లేకుండానే దిడీలున ఈ భావం కలగవచ్చు. ఉదాహరణంగా రైతు పొలంపని చేసికొంటూండగా తటాలున ఈ భావం కలగవచ్చు. అప్పడది దేవునినుండే వచ్చినట్లు. ఎందుకంటే, మన ఆత్మ దేవునికి సొంతయిల్లు లాంటిది. దేవుడు మాత్రమే నేరుగా ఆయాత్మలోకి ప్రవేశింపగలడు. పిశాచాలుగాని దేవదూతలుగాని నేరుగా మన ఆత్మ లోకి ప్రవేశించలేరు. కనుక ప్రార్ధన మొదలైన పూర్వకారణాలు లేకుండా తటాలున కలిగిన ఆనందభావం దేవుని నుండి వచ్చినదై వుండాలి. దానిని నమ్మవచ్చు. కాని యీలాంటి ఆనందానుభూతి చాల అరుదుగా మాత్రమే కలుగుతోంది. రెండవది, ఈ యూనందానుభూతి పూర్వకారణాన్ని పురస్కరించుకొని రావచ్చు. ప్రార్ధన చేసికోవడం, భక్తిగల ప్రసంగాన్ని వినడం మొదలైనవి పూర్వకారణాలు. వీటి తర్వాత ఆనందానుభూతి కలిగితే అది సదాత్మనుండయినా రావచ్చు. లేక దుష్టాత్మనుండయినా రావచ్చు. పిశాచం గూడ మనలను మోసగించడానికి ఈ భావాన్ని కలిగించగలదు. అప్పడు గుర్తుపట్టడం ఏలా? ఒక పని ఆదిలో, మధ్యలో, అంతంలో గూడ భక్తిమంతంగా వుంటే అది దేవుని ప్రేరణంవల్ల కలిగిన మంచి పని