పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1) బైబులు బోధలు క్రీస్తు నన్ననుసరింపగోరేవాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను మోసికొని, నన్నుసరించాలి అని చెప్పాడు -మత్త 16,24. పౌలు భక్తుడు శరీరానుసారంగా జీవిస్తే మీరు తప్పక మరణిస్తారు. ఆత్మచే పాపక్రియలను నశింపచేస్తే మీరు జీవిస్తారు అని నుడివాడు -రోమా 8, 18. నిగ్రహం ద్వారా మన జంతు శరీరాన్ని అదుపులోకి తెచ్చుకొంటాం. క్రీస్తుకి చెందినవాళ్లు వ్యామోహాలతోను కోరికలతోను కూడిన తమ శరీరాన్ని సిలువవేసికొన్నారు -గల 5,23. నిగ్రహం ద్వారా మనలోని పాపపు మానవుడు నశిస్తాడు. నూత్ననరుడు, అనగా వరప్రసాద మానవుడు మేలుకొంటాడు. సంయమనం మనకు వరప్రసాదాన్ని దయచేస్తుంది. దానివలన పాపాన్ని విసర్జించి దైవమార్గంలో నడుస్తాం. 2) నిగ్రహంతో ఏమి యవసరం? అసలు నిగ్రహంతో ఏమి యవసరం? సినిమాలు, టీవీలు, పత్రికలు, ప్రకటనలు మొదలైన సమాచార సాధనాలు మన దృష్టిని నిరంతరం లోకవస్తువులవైపు త్రిప్పతుంటాయి. నరుడు సుఖాలను అనుభవించాలని చెప్తుంటాయి. ఈ సాధనాల వల్ల మనకు తెలియకుండానే లోకవస్తువుల్లో కూరుకొని పోతాం. దేవుణ్ణి విస్మరిస్తాం. ఈ పరిస్థితిలో నిగ్రహం దేవుణ్ణి జ్ఞప్తికి తెస్తుంది. ఈలోకం, ఇక్కడి సుఖాలు శాశ్వతం కావు అని హెచ్చరించి మన చూపు దేవుని వైపు మరలేలా చేస్తుంది. క్రీస్తుని అనుసరించేవాడు క్రైస్తవుడు. మన జీవితం క్రీస్తు జీవితంలాగ వుండాలి. అతని కోరికలూ ఆశయాలూ మనవి కావాలి. ఐతే క్రీస్తు భోగ మార్గంలో పోలేదు. కావాలని సిలువమార్గాన్నియెన్నుకొన్నాడు. ఆ ప్రభువు జీవితమంతా సిలువతోను వేదసాక్షి మరణంతోను నిండివుంది. గురువు సిలువమార్గాన్ని ఎన్నుకొంటే శిష్యుడు సుఖమార్గాన్ని యెన్నుకోగూడదు. క్రీస్తుని అనుసరించిన బ్రీ సిలువ మార్గంలోనే