పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బాధ్యతలను నెరవేర్చడం నైతికవిలువలు. భగవంతునితో సఖ్య సంబంధాలు పెట్టుకొని జీవించడం ఆధ్యాత్మిక విలువలు. ఈ మూడవ వర్గం విలువలు అన్నిటికంటె గొప్పవి. మనం ప్రధానంగా పాటించవలసింది ఇవే. పవిత్ర గ్రంథాలు చదువుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. జంతువాంఛలను అదుపులో పెట్టుకోవాలి. ప్రేమ, సేవ, భూతదయు మొదలైన దొడ్డగుణాలను అలవర్చుకోవాలి. నరుడు పై మెట్టెక్కిదివ్యడుగా మారాలి కాని దిగజారిపోయి పశువుగా తయారు కాకూడదు. నేటినరులు సులువుగా వస్తుదాస్యంలో పడిపోతున్నారు. ధనం, అధికారం, పదవులు, కీర్తి ప్రతిష్టలు- ఇవి నేటినరులు ప్రబలంగా ఆశించేది. ఎన్ని వస్తువులు కూడబెట్టుకొంటే అంతగొప్ప అనుకొంటున్నారు. కాని సోక్రటీసు, గాంధి మొదలైన మహాపురుషులు వస్తుదాస్యానికి లొంగలేదు. వస్తువులు భగవంతుణ్ణి చేరడానికి నిచ్చెన మెట్లలాగ వుపయోగపడతాయి. వాటంతట వాటికి విలువ లేదు. ఐనా చాలమంది వస్తువుల్లో చిక్కుకొని వాటిని చేసిన భగవంతుణ్ణి విస్మరిస్తుంటారు. ఇది వట్టి అవివేకం. అగస్టీను భక్తుడు ఓ ప్రభూ! మా హృదయాన్ని నీ కొరకే చేశావు. నీ యందు విశ్రమించిందాకా దానికి విశ్రాంతి లేదు అని వాకొన్నాడు. నరుని గమ్యం అతడు చేరవలసిన రేవు, భగవంతుడు వొక్కడే గాని లోక వస్తువులు కాదు. బుద్ధిమంతుడు ఈ లోకంలో వుండగానే పరలోక జీవితానికి సిద్ధం కావాలి. ఇహలోక జీవితంతోనే పరలోక జీవితాన్ని కొనుక్కోవాలి. దాన్ని కోల్పోతే మన మనుష్యజన్మ వ్యర్థమై పోయినట్లే. మన తాత్వికులు, దార్శనికులు నిరంతరం ఆధ్యాత్మిక దృష్టితోనే జీవించారు. 2. క్రైస్తవ జీవితమూ, నిగ్రహమూ పైన ప్రాచీన జ్ఞానులు భోగవాదాన్ని నిరసించి ఆధ్యాత్మిక దృష్టితో జీవించారని చెప్పాం. భోగవాదానికి విరుగుడు స్వీయ నిగ్రహం. క్రైస్తవులమైన మనం నిగ్రహాన్ని తప్పక పాటించాల్ని